పొరపాట్లు గ్రహిస్తున్న జగన్ ! కాస్త ఆలస్యం అయినా వేటు వేశారుగా ?

అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న ! అన్నట్లుగా  జగానే ఏపీ సీఎం హోదాలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు అనుకుంటే,  ఆయన టీం లో పనిచేసే ఓ అధికారి అంతకంటే ఎక్కువ దూకుడును ప్రదర్శించడం, దానిపై పెద్దఎత్తున చర్చ జరగడం , జరగాల్సిన నష్టం జరిగిపోవడం అన్నీ జరిగిపోయాయి.ఇంకా అనేక వివాదాలు చుట్టుముట్టబోతున్నాయి అనుకుంటున్న సమయంలో అసలు విషయాన్ని జగన్ గ్రహించారు.

 Mistakes Pics Was It A Bit Late But Hunting Jagan, Ap Cm, Ias Praveen Praksh, I-TeluguStop.com

వెంటనే సదరు అధికారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇంతకీ ఆ అధికారి ఎవరు ఏం చేశారు అంటే.

 సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు వహిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ను జగన్ ఆకస్మికంగా ఆ పోస్టు నుంచి తప్పించి ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న ముత్యాలరాజు ను నియమించారు.జగన్ తీసుకున్న నిర్ణయం ఒకరకంగా సంచలనం గానే చెప్పుకోవాలి.

ఎందుకంటే సీఎం కార్యాలయంలో కీలక అధికారి గా ప్రవీణ్ ప్రకాష్ అంటే ఐఏఎస్ వర్గాలే హడలిపోయే పరిస్థితి ఉంది.గతంలో ఆయన అనేక జిల్లాల్లో కలెక్టర్ గా పని చేసిన అనుభవం ఉంది.

అంతే కాకుండా ముక్కుసూటిగా వ్యవహరిస్తూ సమర్థవంతమైన అధికారిగా పేరు ప్రఖ్యాతలు ఆయన సంపాదించుకున్నారు.అటువంటి వ్యక్తిని జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎంవో లోకి  తీసుకున్నారు.ఆయనే కాకుండా జగన్ జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి , రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం వంటి వారి పై నమ్మకంతో కీలక స్థానాలను అప్పగించినా, వారి వ్యవహారం జగన్ కి నచ్చకపోవడంతో వారిని తప్పించారు.

Telugu Ap Cm, Ap, Ias Officers, Jagan-Telugu Political News

ఆ తర్వాత ప్రవీణ్ ప్రకాష్ ను సీఎం లోకి తీసుకు వచ్చారు.సరిగ్గా జగన్ ఏ విధంగా అయితే ఆలోచిస్తారో,  అంతకంటే వేగంగా ప్రవీణ్ ప్రకాష్ జగన్ నిర్ణయాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్న తీరు మొదట్లో జగన్ కు ఆనందాన్ని కలిగించినా, ప్రవీణ్ ప్రకాష్ దూకుడు కారణంగా మిగతా ఐఏఎస్ అధికారులలో ఆగ్రహం కలిగిస్తుందనే విషయాన్ని జగన్ ఆలస్యంగా గుర్తించారు.అంతే కాకుండా కొన్ని నిర్ణయాలు సంబంధిత శాఖ అధిపతులకు, చీఫ్ సెక్రటరీ కి తెలియకుండా ప్రవీణ్ ప్రకాష్ అమలు చేస్తూ ముందుకు వెళ్లడం పైన అనేక ఫిర్యాదులు జగన్ కు అందాయి.

ఇటీవల వాణిజ్య పన్నులు, స్టాంపులు ,రిజిస్ట్రేషన్ విభాగాలను రెవెన్యూ శాఖ నుంచి తప్పించి ఆర్థిక శాఖకు మార్చే విషయంలో ప్రవీణ్ ప్రకాష్ సొంతంగా నిర్ణయం తీసుకోవడం,  అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ ల  అధికారాలలో కోత విధించి, వాటిలో కొన్నింటిని విఆర్ఓలకు బదిలీ చేస్తూ జీవో నెంబర్ 2 జారీ చేయడం పెద్ద వివాదమే రేపింది .ఈ జీవోను ఇటీవల హైకోర్టు సస్పెండ్ చేయడంతో ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారంపై జగన్ దృష్టి సారించారు.ఇవే కాకుండా అనేక నిర్ణయాలపై ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారశైలి పై జగన్ కు ఫిర్యాదులు అందడంతో పరిస్థితి చేయి దాటి ముందే ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించారు.కాస్త ఆలస్యం అయినా సరైన నిర్ణయం తీసుకున్నారంటూ మెజారిటీ ఐఏఎస్ లే అభిప్రాయపడుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube