నందమూరి బాలకృష్ణ తో డిక్టేటర్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీవాస్ ప్రస్తుతం మరో సినిమాను ఆయనతోనే చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.బెల్లం కొండతో శ్రీవాస్ తెరకెక్కించిన సాక్ష్యం సినిమా నిరాశ పర్చింది.
దాంతో ఆయన తదుపరి సినిమా కు కాస్త గ్యాప్ తీసుకున్నాడు.ఆ కాస్త గ్యాప్ కరోనా వల్ల పెద్దగా అయ్యింది.
ఈ కరోనా గ్యాప్ తర్వాత బాలయ్య తో సినిమాను ఆయన చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో బాలయ్య అభిమానులు ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు.మళ్లీ ఈయనతో సినిమా ఏంటీ బాసూ అంటూ కొందరు కామెంట్స్ చేశారు.
ఈ సమయంలో మళ్లీ మళ్లీ బాలయ్యకు ప్లాప్ లు పడితే మేము తట్టుకోలేము అంటూ కొందరు కామెంట్స్ చేశారు.అందరు కాస్త కూల్ అయ్యేలా బాలయ్యతో కాకుండా తన తదుపరి సినిమాను గోపీచంద్ తో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
లక్ష్యం మరియు లౌక్యం సినిమా లో వీరి జోడీ ఇప్పటికే రెండు సక్సెస్ లను దక్కించుకున్నాయి.కనుక మూడవ సినిమా తో ఖచ్చితంగా హ్యాట్రిక్ దక్కించుకుంటారు అనే నమ్మకంతో ఉన్నారు.
పెద్ద బడ్జెట్ కాకుండా మీడియం రేంజ్ బడ్జెట్ తో సింపుల్ గోపీచంద్ తో ఒక మంచి కమర్షియల్ మూవీని తీసేందుకు శ్రీవాస్ స్క్రిప్ట్ సిద్దం చేశాడు.ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చింది.
ప్రస్తుతం గోపీచంద్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.ఆ సినిమాలు పూర్తి అయిన తర్వాత అంటే వచ్చే ఏడాదికి ఈ హ్యాట్రిక్ కాంబో మూవీ పట్టాలు ఎక్కబోతుంది.గోపీచంద్ తో ఇప్పటికే రెండు సక్సెస్ లు ఇచ్చాడు కనుక శ్రీవాస్ మరో సక్సెస్ ను కూడా సెంటిమెంట్ ప్రకారం ఇస్తాడేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.గోపీచంద్ తో సినిమా పూర్తి అయిన తర్వాత బాలయ్యతో సినిమాను శ్రీవాస్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.