కొవిడ్ నేపథ్యంలో సినిమా హాల్ మూతబడ్డాయి.చాలా మంది ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌లపై ఆధారడక తప్పడం లేదు.
చిన్న మూవీలతో పాటు కొన్ని పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి.ఈ సందర్భంగా మన దేశంలో దాదాపు 57 శాతం మంది ఏదో ఒక ఓటీటీ ప్లాట్‌ఫాంను సబ్‌స్క్రైబ్ చేసుకుని ఉన్నారని సర్వేలో తేలింది.
అందులో ఈ జాబితాలో నెట్‌ఫ్లిక్స్ టాప్ పొజిషన్‌లో స్ట్రీమ్ అవుతుందని తెలిసింది.దాదాపు 26 శాతం మంది నెట్‌ఫ్లిక్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారే.
ఈ సర్వేను కంపారిజన్ వెబ్‌సైట్ ఫైండర్ నిర్వహించింది.దీన్ని ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వే ఆధారంగా దాదాపు 18 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది.
ఇందులో మూడు ప్రధాన స్ట్రీమింగ్‌లను ఎక్కువ శాతం వీక్షిస్తున్నారు.అది నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్.
ఇక రెండో జాబితాలో డిస్నీ హాట్‌స్టార్ నిలిచింది.ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్.13.94 శాతం డిస్నీ హాట్‌స్టార్‌ను చూస్తున్నారు.ఇది ప్రస్తుతం 11 దేశాల్లో అందుబాటులో ఉంది.నెట్‌ఫ్లిక్స్ అయితే 190 దేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది.ప్రైమ్ వచ్చేసి 200 దేశాల్లో ఉంది.
భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ తర్వాత అమెజాన్ 19 శాతం వీక్షకులతో రెండో ప్లేస్‌లో నిలిచింది.
హాట్‌స్టార్ 17 శాతంతో మూడో జాబితాలో ఉంది.
జియో టీవీ 14.73 శాతంతో నాలుగో ప్లేస్‌లో నిలిచింది.అల్ట్‌బాలాజీకి 3.5తో ఐదో స్థానంలో ఉంది.అదేవిధంగా భారత్‌లో దాదాపు 58.15 శాతం మంది పురుషులు, 55.93 శాతం స్త్రీలు ఈ సర్వేలో షేర్ చేసుకున్నారు.ఇందులో 26.69 మంది మహిళలు, 26.33 శాతం పురుషులు నెట్‌ఫ్లిక్స్‌కే ఓటు వేశారు.అమెజాన్ ప్రైమ్‌పై కూడా దాదాపు 21 శాతం మంది మహిళలు మొగుగ చూపారు.
పురుషులు 18 శాతం.డిస్నీ హాట్‌స్టార్‌కు 16.99 శాతం మంది పురుషులు, 16.53 మంది మహిళలు ఓటు వేశారు.జియో టీవీకి 16.64 మంది మగవారు, కేవలం 10 శాతం మహిళలు ఓటు వేయగా , అల్ట్ బాలాజీకి 3.56 పురుష సబ్‌స్క్రైబర్లు ఉండగా.2.75 శాతంతో మహిళలు ఉన్నారు.
ఈ సర్వేను కూడా వివిధ ఏజ్ గ్రూపుల మధ్య జరిగింది.భారత్‌లో 18–24 మధ్య ఏజ్ గ్రూప్‌వారిని 24.4 శాతం సర్వే చేశారు.25–34 ఏజ్ గ్రూపువారిపై 30.91 శాతం సర్వే నిర్వహించారు.వీరంతా దాదాపుగా నెట్ ఫ్లిక్స్‌కే ఓటు వేశారు.35–44 వయస్సువారు, 45–54 ఏజ్ గ్రూపువారు కూడా 25 శాతంతో నెట్‌ఫ్లిక్స్‌కే పచ్చజెండా ఊపారు.డిస్నీ హాట్‌స్టార్‌ను 55–64 ఏజ్‌గ్రూపువారు ఎక్కువ శాతం వీక్షిస్తున్నారని తేలింది.నెట్‌ఫ్లిక్స్‌ను ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్న వారి జాబితాలో భారత్‌ది 14 వ స్థానం.కెనడా మొదటిస్థానం లో నిలిచింది.భారత్‌లో ఇతర స్ట్రీమింగ్ యాప్‌ల కంటే కూడా నెట్‌ఫ్లిక్స్ కాస్త ఖరీదైంది.దీని సబ్‌స్క్రిప్షన్ ఖరీదు కూడా రూ.649, ప్రీమియం ప్లాన్ ధర రూ.799.