రాష్ట్రంలో బీటెక్ చదివే విద్యార్థులకు జేఎన్టీయూ సాంకేతిక విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది.ఇక నుంచి ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదువుకోవచ్చని బంపర్ ఆఫర్ ప్రకటించింది.
దీని ప్రకారం ఇన్నాళ్లు జేఎన్టీయూ ఆధ్వర్యంలో నడుస్తున్న బీటెక్ కాలేజీల్లో కేవలం ఒక టైమ్ పీరియడ్ లో ఒకే డిగ్రీ మాత్రమే చదివేందుకు వీలుండేది కానీ తాజాగా జేఎన్టీయూ అధికారులు ప్రకటించిన దాని ప్రకారంగా కాలేజీల్లో విద్య నభ్యసించే వారు ఏక కాలంలో రెండు డిగ్రీలు చదవాడనికి అర్హులు.
ఇందుకు కావల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు.
బీటెక్ స్టూడెంట్స్ కు సీటు వచ్చిన బ్రాంచిలో చేసిన డిగ్రీని మేజర్ డిగ్రీ అని తమకు నచ్చిన వేరే బ్రాంచిలో పూర్తి చేసిన డిగ్రీని మైనర్ డిగ్రీ అని పిలుస్తారు.ఇది వరకు పోయినేడాదే జేఎన్టీయూ అధికారులు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినా.
కానీ అది ఎందుకో అమలు కాలేదు.కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఎలాగైనా ఈ డ్యూయల్ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు.

మరో విషయం ఏంటంటే జేఎన్టీయూ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ర్టంలోని ఐఐటీ కాలేజీల్లో ఇలాంటి రెండు డిగ్రీల విధానం ఇప్పటికే అమలవుతోంది.జేఎన్టీయూ అకడమిక్ సెనేట్ బృందం కూడా ఈ డ్యూయల్ డిగ్రీ విధానానికి సుముఖంగా ఉండటంతోదీనిపై మరింత పరిశోధనలు చేసి, విధి విధానాలు రూపొందించడానికి నిపుణుల కమిటీని నియమిస్తారని తెలిసింది.కాగా బీటెక్ లో ఉన్న కొన్ని కోర్సుల పట్ల విద్యార్థులు అంతగా ఆసక్తి చూపకపోవడం వల్ల సదరు బ్రాంచిల్లో వేల సంఖ్యలో సీట్లు మిగిలి పోతున్నాయి.అధికారులు డ్యూయల్ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఇది కూడా ఒక కారణం.
కోర్ గ్రూపులకు ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టే ఈ విధానం ఎంత వరకు సక్సెస్ అవుతుందో.