“తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్” కు ఎక్కిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం

తెలుగు బాషలో ఉన్న తియ్యదనం, ప్రేమ, కమ్మదనం ఇంకెక్కడా ఉంటుంది.కమ్మని తెలుగు అమ్మలాంటి తెలుగు గడ్డపై పుట్టిన ప్రతీ ఒక్క తెలుగు వారు గర్వంగా చెప్పుకోవచ్చు దేశ బాషలందు మాత్రమే కాదు, ప్రపంచ బాషలందు తెలుగు లెస్సా అని.

 Telugu Artists In International Cultural Association 2021, International Cultu-TeluguStop.com

విదేశాలకు వెళ్ళిపోయాం కదా మనకెందుకులే అనుకోకుండా తెలుగు వెలుగులను దేశ విదేశాలలో ప్రసరింప జేస్తున్న ఎందరో తెలుగు ప్రవాసులకు మనం చేతులెత్తి మొక్కాల్సిందే.మనకెందుకు అనుకుంటే ఈ నాడు విదేశంలో తెలుగు వెలుగులు విరబూసేవే కావు.

వారు చేపట్టే కార్యక్రమాలు ఎంతో మంది విదేశీయులని సైతం తెలుగు నేర్చుకునే విధంగా ప్రేరేపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

Telugu Srisamskruthika, Venkaiah-Telugu NRI

తాజాగా సింగపూర్ లో శ్రీ సాంస్కృతిక కళా సారధి సంస్థ ప్రధమ వార్షికోత్స సందర్భంగా 3,4 తేదీలలో అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 35 దేశాల నుంచీ దాదాపు 45 తెలుగు అభివృద్ధి సంస్థలు పాల్గొన్నాయి.ఎంతో మంది తెలుగు బాషా పండితులు, ప్రముఖులు, మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా పాల్గొన్నారు.

ఓ తెలుగు వెలుగు కార్యక్రమానికి మొట్టమొదటి సారిగా ఇంతమంది పాల్గొనడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ కార్యక్రమం ఎక్కిందని సంస్థ అధ్యక్షులు ప్రకటించారు.

సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, తనికెళ్ళ భరణి, సాయి కుమార్, హర్ష వర్ధన్ పాల్గొనగా, మాజీ ఎంపీ మురళీ మోహన్, మండలి మాజీ డిప్యుటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

విదేశాలలో ఉంటూ ఎన్నెన్నో పనులలో బిజీ బిజీ గా గడిపే తెలుగు వారందరూ ఇంత చక్కగా అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేసి ఇందులో పాలు పంచుకోవడం, ఎంతో వైభవంగా ఈ వేడుకలను ఏర్పాటు చేయడం చాలా గర్వంగా ఉందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రతీ ఒక్కరికి సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube