వాట్సాప్‌ లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఎలా తెలుసుకోవచ్చంటే..!

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ మెసేజింగ్ యాప్ వాడుతున్నారు.వాట్సాప్ లేని ఫోన్ అంటూ లేదనే చెప్పాలి.

 How To Know Who Blocked You In Whatsapp , Whatsapp Tips , Tricks, Online Status,-TeluguStop.com

అయితే కొంతమంది వాళ్ళకి ఇష్టంలేని వ్యక్తులు మెసేజెస్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళని బ్లాక్ చేసే సదుపాయం వాట్సాప్ ఫీచర్స్ లో ఉంది.కానీ వాట్సాప్‌ లో మీ కాంటాక్ట్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో ఉందని మీకు తెలిసే ఆప్షన్ అయితే లేదు.

కానీ కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా మీ నెంబర్ ఎవరూ బ్లాక్ చేశారో అనే విషయం తెలుసుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దామా.

ముందుగా వాట్సాప్‌ లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవాలంటే వాట్సాప్ ఓపెన్ చేయగానే మన అందరికి లాస్ట్ సీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.అయితే ఎవరైనా మీ కాంటాక్ట్ బ్లాక్ చేసి ఉంటే మీకు ఈ ఆప్షన్ కనపడదు.

అదే ఒకవేళ వాళ్ళ లాస్ట్ సీన్ కనుక మీకు కనిపిస్తే మీ కాంటాక్ట్ బ్లాక్ చేయలేదని అర్థం.అలాగే వాట్సాప్ లో ఆన్ లైన్ స్టేటస్ చెక్ చేయడం ద్వారా కూడా మీ కాంటాక్ట్ బ్లాక్ చేశారో లేదో తెలిసిపోతుంది.

ఎదుటి వాళ్ళు మీ కాంటాక్ట్ ను బ్లాక్ చేస్తే వాళ్ళ ఆన్లైన్ స్టేటస్ మీకు కనిపించదు.

ఇంకా వాట్సాప్ కి ఏదైనా ప్రొఫైల్ ఫొటోను పెట్టుకుంటూ ఉంటారు.

ఆ ప్రొఫైల్ పిక్ ను ఒకసారి చెక్ చేసి చూడండి.ఒకవేళ వాట్సాప్ అకౌంట్లో ఎవరైనా మీ కాంటాక్ట్ బ్లాక్ చేస్తే వారి ప్రొఫైల్ ఫొటో మీకు కనిపించదు.

బ్లాంక్ గా కనిపిస్తుంది.

Telugu Status, Profile, Tick Mark, Whatsapp Block, Whatsapp Tips, Whatsapp-Lates

మరొక టిప్ ఏంటంటే వాట్సాప్ యాప్ నుంచి మీరు ఒకసారి వాయిస్ కాల్ చేసి చూడండి.ఒకవేళ మీ కాంటాక్ట్ కనుక బ్లాక్ లిస్ట్ లో ఉంటే ఎట్టి పరిస్థితులలో వాట్సాప్ కాల్ వెళ్లదు.అలాంటప్పుడు మీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో ఉందని అర్థం చేసుకోవచ్చు.

అలాగే వాట్సాప్ యాప్ లో గ్రూప్ క్రియేటింగ్ సదుపాయం కూడా కలదు.ఒకసారి మీ వాట్సాప్ అకౌంట్‌ నుంచి గ్రూపు క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేసి చూడండి.

ఒకవేళ వాళ్ళు మీ కాంటాక్ట్ బ్లాక్ లిస్ట్ లో పెడితే వారి కాంటాక్ట్ నెంబర్ గ్రూపులో యాడ్ అవ్వదు.అలాగే మీ వాట్సాప్ నుంచి మీరు అనుమానించే వ్యక్తికి ఒక మెసేజ్ చేసి చూడండి.

Telugu Status, Profile, Tick Mark, Whatsapp Block, Whatsapp Tips, Whatsapp-Lates

ఒకవేళ ఆ వ్యక్తి మీ కాంటాక్ట్ బ్లాక్ చేసి ఉంటే మీరు పంపిన మెసేజ్ డెలివరీ అవ్వదు.ఒక సింగిల్ రైట్ మార్క్ మాత్రమే కనిపిస్తుంది.అలా కాకుండా డబుల్ రైట్ మార్క్ కనిపిస్తే మీరు పంపిన మెసేజ్ డెలివరీ అయినట్టు అర్థం.అంటే మీరు అనుమానించే వ్యక్తి మీ నెంబర్ బ్లాక్ చేయలేదని అర్ధం.

పైనే తెలిపిన టిప్స్ ద్వారా మీ కాంటాక్ట్ ఎవరైనా బ్లాక్ చేస్తే ఈజీగా కనిపెట్టవచ్చు.మరి మీరు కూడా మీకు అనుమానం ఉన్న కాంటాక్ట్ నెంబర్ పై పైన తెలిపిన టిప్స్ ఒక సారి ట్రై చేసి చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube