టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ తర్వాత పలు సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తన పోస్టులతో యువతను బాగా పిచ్చెక్కిస్తుంది.
పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.
ఆ తర్వాత తెలుగులో హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్ ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ నిత్యం తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్ గా మారింది.అందులో పాయల్ తన పాదాలను తన ప్రియుడి సౌరబ్ పాదాలతో ఆనించి ఉండగా ఈ ఫోటోను చూసిన నెటి జనులు పెళ్లికి ముందే ఇలా చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.

పాయల్ రాజ్ పుత్ సౌరబ్ దీంగ్రా అనే వ్యక్తితో బాగా సన్నిహితంగా ఉంటుంది.అతనితో చేసే అల్లర్లు అంతా ఇంతా కాదు.ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళుతూ బాగా హాట్ టాపిక్ గా మారుతుంటారు.అంతే కాకుండా గతంలో ఇద్దరు ఒకే రూములో ఉంటూ దిగిన ఫోటోలను కూడా షేర్ చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది పాయల్.