బాలీవుడ్ స్టార్స్ పలువురు సౌత్ సినిమా ల పై ఆధార పడుతున్నారు.తెలుగు లో మరియు తమిళంలో రూపొందుతున్న సినిమా లను తీసుకుని హిందీ లో రీమేక్ చేస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు.
సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో చాలా సౌత్ సినిమా లను రీమేక్ చేశాడు.సౌత్ సినిమా లపై ప్రత్యేక శ్రద్ద పెట్టి మరీ సల్మాన్ రీమేక్ లు చేస్తున్నాడు.
కమర్షియల్ గా సక్సెస్ అయిన సినిమా లను ఆయన రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉంటాడు.ఇక ఖిలాడి సినిమా ను రీమేక్ చేసేందుకు సల్మాన్ ఖాన్ ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.
రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా ఇంకా విడుదల కానే లేదు.అప్పుడే సల్మాన్ ఈ సినిమా గురించి తెలుసుకున్నాడట.
దర్శకుడు రమేష్ వర్మ ఈ కథను సల్మాన్ వద్దకు చేరవేశాడట.దాంతో ఖిలాడీ రీమేక్ లో నటించాలని ఆసక్తిగా ఉన్నాడట.
ఖిలాడీ హిందీ వర్షన్ ను రమేష్ వర్మ దర్శకత్వం వహించబోతున్నాడని కూడా అంటున్నారు.తెలుగు లో ఖిలాడీ సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నారు.సక్సెస్ అయిన వెంటనే సినిమా ను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రవితేజ గతంలో నటించిన సినిమా లు హిందీ లో రీమేక్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

అందుకే ఈ సినిమా కూడా హిందీ లో రీమేక్ అవ్వడం దాదాపుగా కన్ఫర్మ్ అంటున్నారు.సల్మాన్ కు రీమేక్ ల్లో నటించి సక్సెస్ దక్కించుకున్న అనుభవం ఉంది.అందుకే ఖిలాడి సినిమా ను కూడా హిందీ లో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడట.ఖిలాడి సినిమా ఈ ఏడాది ఆగస్టు లేదా దసరా సందర్బంగా విడుదల అయ్యే అవకాశం ఉంది.