పెళ్లి చేసుకుంటావా అని అడిగిన నెటిజన్.. శృతి ఏమన్నారంటే..?

క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.ఒకవైపు సినిమా పనులతో ఎంత బిజీగా ఉన్నా శృతిహాసన్ వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

 Shruti Hassan Interesting Comments About Netizen Questions, Interesting Comments-TeluguStop.com

తాజాగా శృతిహాసన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించడంతో పాటు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో తనది మంచి పాత్ర అని శృతిహాసన్ అన్నారు.

సలార్ మూవీ పాత్రకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చెప్పలేనని తెలిపారు.మరి కొందరు నెటిజన్లు క్రాక్ సినిమాలో ఫైట్లు అద్భుతంగా చేశారని సలార్ సినిమాలో కూడా అదే విధంగా ఫైట్లు చేస్తార .? అని ప్రశ్నించగా సలార్ సినిమాలో తాను ఫైట్ సీన్లలో నటించడం లేదని శృతి పేర్కొన్నారు.ఒక నెటిజన్ శృతిహాసన్ యొక్క పర్సనల్ ఫోన్ నంబర్ గురించి అడగగా తాను నంబర్ ఇవ్వనని శృతి చెప్పుకొచ్చారు.

Telugu Crack, Netizen, Salaar, Shrti Hassan, Tollywood-Movie

మరొక నెటిజన్ ఏకంగా తనను పెళ్లి చేసుకోవాలని శృతిహాసన్ ను కోరగా తాను చేసుకోనని శృతిహాసన్ తెలిపారు.నెటిజన్లు చిరాకు తెప్పించే ప్రశ్నలు వేసినా శృతి మాత్రం అభిమానులు ఏ మాత్రం హర్ట్ కాకుండా హుందాగా బదులివ్వడం గమనార్హం.మరొక నెటిజన్ సిద్దార్థ్, శృతిహాసన్, హన్సిక నటించిన ఓ మై ఫ్రెండ్ సినిమా గుర్తుందా అని ప్రశ్నించగా ఓ మై ఫ్రెండ్ తన ఫేవరెట్ మూవీ అని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Crack, Netizen, Salaar, Shrti Hassan, Tollywood-Movie

మరొక నెటిజన్ మీరు వైజాగ్ కు ఎప్పుడు వస్తారు అని ప్రశ్నించగా వైజాగ్ తో తనకు అనుబంధం ఉందని తరచూ తాను వైజాగ్ కు వస్తూనే ఉంటానని శృతిహాసన్ వెల్లడించారు.శృతిహాసన్ నెటిజన్ల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలతో కూడా శృతిహాసన్ బిజీగా ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube