ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొద్దికొద్దిగా తగ్గుతున్న సంగతి తెలిసిందే.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ నిర్ణయం బాగా పని చేస్తుందని చెప్పవచ్చు.
పాతిక వేలకు పైగా రోజుకు కొత్త కేసులు నమోదు అయ్యే పరిస్థితి ప్రస్తుతం రోజు 10,000 కేసులు కి పడిపోయింది.అన్ని జిల్లాల్లో పరిస్థితి బాగానే ఉన్నా గాని ఏపీలో మొదటి నుండి తూర్పుగోదావరి జిల్లా ని మహమ్మారి కరోనా పగబట్టినట్లు పరిస్థితులు మారిపోయాయి.
జిల్లాలో అందరూ మాస్కులు ధరిస్తున్న గాని భౌతిక దూరం పాటించక ఎక్కడికక్కడ గుంపులుగా ఉంటూ వ్యవహరించడం వల్ల కేసులు రోజుకి రెండు వేలకు పైగానే నమోదు అవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మరోపక్క బ్లాక్ ఫంగస్ కేసులు కూడా జిల్లాలో పెరగటం ప్రభుత్వ యంత్రాంగాన్ని టెన్షన్ పుట్టిస్తోంది.
కర్ఫ్యూ సడలింపు సమయములో బయటకు వచ్చినపుడు గుంపులు గుంపులుగా జనాలు గుమ్మ గూడటం వల్లే జిల్లాలో ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు.మరో పక్క పోలీసులు ఎంత పహారా మున్సిపల్ సిబ్బంది కఠిన నియమాలు నిర్వహిస్తున్న జిల్లాలో జనాలలో కరోనా భయం లేకుండా ఉండటం వల్ల కేసులు అధికంగా అవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఏదిఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ నుండి తూర్పుగోదావరి జిల్లా లో వైరస్ విలయ తాండవం చేస్తూ ఉంది.ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్న ప్రజలలో భయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నది అని అధికారులు చెప్పుకొస్తున్నారు.