'ఆర్‌ఆర్‌ఆర్‌' రిలీజ్‌ రికార్డ్‌.. భారతీయ సినీ చరిత్రలో మొదటిసారి

టాలీవుడ్‌ జక్కన్న సినిమా అంటే రికార్డులు పక్కా అంటూ సింహాద్రి నుండి అభిమానులు గట్టి నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నారు.ఒక్క బాహుబలి సినిమాకు పదుల కొద్ది రికార్డులు బ్రేక్ అయ్యాయి.

 Rajamouli Rrr Movie Big Records , Flim News, Ntr, Ott, Rajamouli, Ram Charan, Rr-TeluguStop.com

ఇక ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో మరెన్ని రికార్డులను బద్దలు కొట్ట బోతున్నాడు క్రియేట్‌ చేయబోతున్నాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బాహుబలి సినిమా కొత్తగా క్రియేట్‌ చేసిన రికార్డుల తాలూకు ఇంకా ఆ ఫ్రెష్‌ నెస్ అలాగే ఉంది.

రాజమౌళి అప్పుడే కొత్త రికార్డులను క్రియేట్‌ చేసేందుకు ఆర్‌ ఆర్‌ ఆర్‌ తో సిద్దం అవుతున్నాడు.రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ లతో ఈ సినిమా ను తెరకెక్కించిన దర్శకుడు ఏ రేంజ్‌ లో చేశాడో ఇటీవల విడుదలైన కొన్ని షాట్స్‌ తో క్లారిటీ వచ్చింది.

ఇక ఇటీవల జక్కన్న తండ్రి.ఈ సినిమాకు రచయిత అయిన విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను ఎప్పుడు లోను కాని ఫీలింగ్ కు ఈ సినిమా చూస్తున్న సమయంలో అయ్యాను అంటూ చెప్పడంతో సినిమా పై మరింతగా అంచనాలు పెంచింది.

ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఓటీటీ.శాటిలైట్‌.

బయ్యర్స్‌ ఇలా ప్రతి ఒక్కరికి కూడా అంచనాలు ఉన్నాయి.

సాదారణంగా ఒక్క సినిమా ఒక ఓటీటీ మరియు ఒక శాటిలైట్‌ ఛానెల్‌ కు అమ్మడం జరుగుతుంది.

కాని ఈ సినిమా మాత్రం ఏకంగా మూడు ఛానెల్స్‌ కు అమ్మడం జరిగింది.స్టార్‌, జీ మరియు ఆషియా నెట్ వారు ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది.

ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను జీ తెలుగు మరియు నెట్‌ ఫ్లిక్స్ కొనుగోలు చేయడం జరిగింది.జీ ఓటీటీ వారు ఈ సినిమాను ఇండియన్‌ భాషల్లో రిలీజ్‌ చేయబోతుంటే నెట్‌ ఫ్లిక్స్ అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

ఇలా ఒకే సినిమా ను ఇన్ని ప్లాట్‌ ఫామ్ లకు మరియు ఇన్ని శాటిలైట్‌ లకు ఇవ్వడం అనేది చరిత్రలో మొదటి సారి.ఇక ఈ రైట్స్ తోనే సినిమా బడ్జెట్‌ ను మించి నిర్మాతలు దక్కించుకున్నారట.

మరో విషయం ఏంటీ అంటే ఈ సినిమా ను ఇతర భాషల్లో రెండు వారాల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు ఓటీటీ ద్వారా రాబోతుందట.మొత్తానికి ఇది విడుదల అయిన తర్వాత కొత్త రికార్డులను క్రియేట్‌ చేయడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube