కరోనా వైరస్‌ను అంతం చేయడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న కృషి అందరికి తెలిసిందే.ఇప్పటికే ఈ వైరస్ కోసం కొన్ని వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి.
అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కంటే ఆయుర్వేద మెడిసిన్ ఈ కరోనాకు చక్కగా పని చేస్తుందని కృష్ణపట్నం ఆనందయ్య నిరూపించినట్లుగా ప్రచారం జరగడంతో అందరి దృష్టి అటువైపు మళ్లీంది.దీంతో ఒక్క సారిగా రాష్ట్రాల్లో ఆనందయ్య పేరు మోగిపోయింది.
అయితే ఈ మందు అందరు అనుకున్నట్లుగా అందరికి అందుబాటులోకీ వస్తే నేడు పరిస్దితి ఎలా ఉండేదో కానీ ఆనందయ్య కరోనా మందుకు అడ్దంకులు ఏర్పడ్డాయి.దీని మీద రిసెర్చ్‌లు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో పొలిటికల్ నేతలు కూడా ఆనందయ్యకు సపోర్ట్ చేస్తుండగా మెడికల్ మాఫియా మాత్రం ఆ మందు బయటకు వస్తే తమ బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అనే భయంలో ఉన్నట్లుగా వార్త ప్రచారంలో ఉంది.ఈ నేపధ్యంలో ఆనందయ్య మందుపై పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆరా తీశారు.
కాగా ఇప్పటికే ఆయుష్ వారి పరిశోధన కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ అదనంగా ఐసీఎంఆర్ విచారణ అవసరం లేదని, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొ.బలరాం భార్గవ్ ఉపరాష్ట్రపతికి తెలియచేసినట్లుగా సమాచారం.