అత్యుత్సాహంతో అభాసుపాలవుతున్న పోలీసులు.. !

తెలంగాణలో కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలుచేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో బయటకు వస్తున్న వారికి పోలీసులకు మధ్య తీవ్ర స్దాయిలో వార్ నడుస్తుంది.

 Telangana, Police, Over Action, Beating Sticks,latest Viral News-TeluguStop.com

ఇప్పటికే అకారణంగా బయటకు వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తామని, చలాన కూడా విధిస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు.అయితే ప్రభుత్వం మాత్రం కొందరికి ఈ లాక్‌డౌన్ నుండి మినహాయింపులు ఇచ్చింది.

కానీ కొన్ని చోట్ల పోలీసులు ఇవేవి పట్టించుకోకుండా అత్యుత్సాహంతో మితిమీరుతున్నారట.

మొన్నటికి మొన్న నల్లగొండలో విద్యుత్ ఉద్యోగులు ఐడీ కార్డు చూపిన పట్టించుకోకుండా వారిని లాఠీలతో కొట్టారు.

దీంతో విద్యుత్ ఉద్యోగులు నల్లగొండ పట్టణంలో విద్యుత్ బంద్ చేసి నిరసన తెలిపారు.ఈ క్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి జోక్యం చేసుకొని డీజీపీతో మాట్లాడటంతో వివాదం సద్దుమణిగింది.

పలుచోట్ల ఫుడ్ సర్వీసుల వారి పై కూడా లాఠీ ఛార్జీ చేశారు.తాజాగా యాదాద్రి జిల్లాలో పోలీసులు నలుగురు ఉద్యోగులకు చలానా విధించారట.ఇలా మొత్తానికి నలుగురికి ఆదర్శంగా నిలిచిన పోలీసులు అత్యుత్సాహంతో అభాసుపాలవుతున్నారు.కరోనాను కట్టడిలో భాగంగా విధులు నిర్వహించమంటే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ, ఇలా చితకబాదడం పై ప్రజల్లో వ్యతిరేక పెరుగుతుందట.

మరి ఈ విషయంలో ఒక్క సారి ఆలోచిస్తే మంచిదని అంటున్నారు జనం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube