మే 2న ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం..!!

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.దేశంలో రోజురోజుకీ కేసులు అత్యధికంగా దాదాపు మూడు లక్షలకు పైగా నమోదు కావడంతో.

 Political Rallies Are Banned After Elections Results Says Election Commission, I-TeluguStop.com

భయంకరంగా కరోనా బారిన పడిన వాళ్ళు ప్రాణాలు విడిచే పరిస్థితి నెలకొంది.ఇదిలా ఉంటే చాలా వరకు దేశంలో కరోనా ఈ రీతిగా విస్తరించడానికి గల కారణం.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ర్యాలీలు మరియు బహిరంగ సభలు అంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన న్యాయస్థానాలు.ఎన్నికల కమిషన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం ఇటీవల మనం చూశాం.

పరిస్థితి ఇలా ఉండగా మే రెండవ తారీకు నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.మే 2న కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు వచ్చిన తర్వాత ఎలాంటి రాజకీయ పార్టీలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని, ర్యాలీలు నిషేధించడం జరిగిందని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube