బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్.ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతిసనన్ సీత పాత్రలో నటిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా ఈ బ్యూటీ కి ఆ మూడు కోరికలు తీరితే చాలంటుంది.
తెలుగులో మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో కృతి సనన్ తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.కానీ ఈ సినిమా తనకు అంత గుర్తింపును ఇవ్వలేకపోయింది.
ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించగా ఎక్కువ అపజయాలు రావడంతో సినిమాలను దూరం పెట్టింది.ఇదిలా ఉంటే మళ్లీ తన కెరీర్ ని ఏకంగా పాన్ ఇండియా సినిమా తో మొదలు పెట్టింది.

ఇక ఈ మధ్య కృతి సనన్ తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా తనకు మూడు కోరికలు ఉన్నాయంటూ అవేంటో తెలిపింది.ఆమెకు ఓ పెద్ద బంగ్లా, అందులో అంతకంటే పెద్ద గార్డెన్, అక్కడ హాయిగా సేదతీరుతూ టీ తాగాలని కోరిక ఉందట.రెండోది స్కై డైవింగ్ చేయడం ఆమెకు చాలా ఇష్టమట.అందులో ఉన్న మజాని ఆస్వాదించడం తన కోరికట.ఇక మూడోది జాతీయస్థాయిలో పురస్కారం అందుకోవాలని ముఖ్యంగా చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తుల బయోపిక్ లో నటించాలని కోరిక ఉందట.ఇక ఈ మూడు కోరికల కోసం బాగా కష్టపడతానంటుంది.
ఇదిలా ఉంటే ఆమె టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.అక్షయ్ కుమార్ తో కలిసి బచ్చన్ పాండే అనే సినిమాలో నటిస్తుంది.
మిమీ, గణపథ్, భేడియా సినిమాల్లో బిజీగా ఉంది.