టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.
తీవ్రవాదం ఎన్ ఐ ఏ ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా తెర కెక్కింది.హైదరాబాద్ లో జరిగిన బాంబు పేలుళ్ల ఆధారంగా వైల్డ్ డాగ్ సినిమాను తెరకెక్కించారు.
ఈ బాంబులను పెట్టిన ఉగ్రవాదులను పట్టుకునే నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.
ఈ సినిమాలో నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఏప్రిల్ 2 న విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.నాగార్జున చాలా రోజుల తర్వాత మళ్ళీ హిట్ కొట్టాడు.ఈ చిత్రాన్ని సినిమా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి నిర్మిస్తుండగా, ఆశిషోర్ సోలమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా చుసిన ఇండస్ట్రీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.తాజాగా ఈ లిస్టులో చిరంజీవి కూడా చేరిపోయాడు.చిరంజీవి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసారు.
చిరంజీవి వైల్డ్ డాగ్ స్పెషల్ షో ద్వారా ఈ సినిమాను వీక్షించారు.సినిమా చూసిన తర్వాత ఈ చిత్ర యూనిట్ కు ప్రశంసలు అందించారు.ఈ మేరకు ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసారు.
‘ఇప్పుడే వైల్డ్ డాగ్ సినిమా చూసాను.తెలుగు రాష్ట్రాల్లో జరిగిన టెర్రర్ వెనుక ఉన్న వ్యక్తుల గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు.ఆ నీచుల్ని ప్రాణాలకు తెగించి పట్టుకున్న రియల్ లైఫ్ హీరోల గురించి అద్భుతంగా చూపించిన నాగార్జున, సోలొమన్, నిరంజన్ రెడ్డి లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఈ సినిమా ప్రతి తెలుగువాడు గర్వంగా చూడాల్సిన సినిమా’ అని ట్వీట్ చేసారు.