ఈమధ్య కాలంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ల రేట్లు అధికంగా పెరుగుతూ వచ్చాయి.అయితే ఆ రేట్లు తగ్గడం ప్రారంభమైందని, ఫ్యూచర్ లో వీటి ధరలు మరింతగా తగ్గుతాయని అంటున్నారు కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా కలకత్తాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయని వాటి ప్రభావం ఇండియా పైనా ఉంటుందని అన్నారు.ఎలక్షన్ కమీషన్ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.
అందుకే పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడ్డదని తెలుస్తుంది.
చమురు కంపెనీలు లీటర్ పెట్రోలు పై 61 పైసలు, డీజిల్ పై 60 పైసలు ధరని తగ్గించగా.14.2 కేజీల వంట గ్యాస్ ధర ను 10 రూపాయల మేర తగ్గించినట్టు సమాచారం.పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గడం ప్రారంభించాయి.ఇంటర్నేషన్ మార్కెట్ ను అనుసరిస్తూ ధరలు పెరగడం తగ్గడం జరుగుతుంటాయి.పెట్రోల్, వంట గ్యాస్ ధరలు రానున్న రోజుల్లో మరింతగా తగ్గుతాయని అన్నారు ధర్మేంద్ర.బీజేపీ ప్రభుత్వం ఎన్నికల టైం లో ఓట్ల కోసమే ధరలను తగ్గిస్తుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఏప్రిల్ రెండవ వారం నుండి ధరల తగ్గుదల ఉంటుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ చెబుతుంది.చమురు ధరల పెరుగుతులకు కరోనా కూడా ఒక కారణమని అంటున్నారు.