ట్రెండింగ్: ఆ చారిత్రాత్మక రోజుకి నేటితో దశాబ్దకాలం పూర్తి..!

భారత క్రికెట్ చరిత్రలో ఏప్రిల్ 2, 2011 ఎప్పటికీ మరువలేనిది.సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున కపిల్ దేవ్ తర్వాత కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల కలలను నెరవేరుస్తూ మహేంద్రసింగ్ ధోని టీమిండియా జట్టు ని వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో గెలిపించారు.

 Trending: Today Marks The End Of A Decade For That Historic Day ..! Trending ,-TeluguStop.com

దీంతో భారత జట్టు రెండవసారి వరల్డ్ కప్ ని హస్తగతం చేసుకుంది.వరల్డ్ కప్ గెలవడం అనేది ప్రతి జట్టుకు ఉండే ఏకైక కోరిక.

దానిని నెరవేర్చడంలో మహేంద్ర సింగ్ ధోనీ సఫలమయ్యారు.ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా మహేంద్ర సింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్ అద్భుతమైన ఆట ఆడి ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును చిత్తు చిత్తుగా ఓడించారు.275 పరుగుల లక్ష్యాన్ని 48.2 ఓవర్లలోనే చేధించడం లో ప్రతి ఒక్క భారత ఆటగాడు కీలక పాత్ర పోషించారు.

కులశేఖర బౌలింగ్ లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్సర్ ని భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.రెండవ సారి వరల్డ్ కప్ ని కైవసం చేసుకున్న తర్వాత సచిన్ టెండూల్కర్ చిరకాలం స్వప్నం నిజమయింది.

దీంతో ఆయన ఆనంద భాష్పాలు కార్చారు.సచిన్ ని తమ భుజాలపై ఎత్తుకుని స్టేడియం అంతా తిరుగుతూ టీమిండియా ఆటగాళ్లు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

Telugu Final, India, Worldcup-Latest News - Telugu

అయితే భారత క్రికెట్ జట్టు 2011లో శ్రీలంకపై ఘన విజయం సాధించి రెండవసారి వరల్డ్ కప్ గెలిచి నేటికీ పదేళ్లు అవుతున్న సందర్భంగా క్రికెట్ అభిమానులు అందరూ అప్పటికి మధుర స్మృతులను నెమరు వేసుకుంటున్నారు.#Worldcup2011 అనే ట్యాగ్ తో క్రికెట్ లవర్స్ సోషల్ మీడియా వేదికగా భారత్ విజయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

2007వ సంవత్సరంలో మహేంద్రసింగ్ ధోని టీ20 వరల్డ్ కప్ కూడా గెలిచారు.రెండు ఫార్మాట్ లలో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఆటగాడు ధోనీకి మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా బిరుదు కూడా వచ్చింది.

ఆయన రెండు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో చలరేగిపోయారు.యువరాజ్ సింగ్ కూడా 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube