టాలీవుడ్ స్టార్ సింగర్ లలో ఒకరైన సునీత ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని మ్యారేజ్ చేసుకున్న తరువాత సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.సునీత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే తాజాగా సింగర్ సునీత అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
సింగర్ సునీత ఇలా క్షమాపణలు చెప్పడానికి ముఖ్యమైన కారణమే ఉంది.
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి ఊహించని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.కేసుల సంఖ్య పెరగడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తుంటే కొన్ని రాష్ట్రాలు మాత్రం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి.
కరోనా కేసులు పెరగడానికి ముందు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆధ్వర్యంలో కొంతమంది సింగర్లతో కలిసి పీపుల్స్ ప్లాజాలో ఒక ఈవెంట్ జరగాల్సి ఉంది.
నిన్న జరగాల్సిన ఈ ఈవెంట్ లో సింగర్ సునీతతో పాటు ప్రముఖ టాలీవుడ్ సింగర్స్ పాల్గొనాల్సి ఉండగా హైదరాబాద్ లో భారీగా కేసులు నమోదు కావడం వల్ల ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.
ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో అభిమానులకు ఆ విషయాన్ని తెలియజేయడంతో పాటు అభిమానులను సునీత క్షమాపణలు చెప్పారు.ఈవెంట్ లో పాల్గొనే వాళ్ల యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని సునీత పేర్కొన్నారు.
మరోవైపు సునీత పెళ్లి తరువాత సింగర్ గా ఆఫర్లతో బిజీ కావడంతో పాటు ప్రోగ్రామ్ లలో, ఈవెంట్లలో పాల్గొంటున్నారు.సునీత కూతురు కూడా ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపును సంపాదించుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
సునీతలా ఆమె కూతురు కూడా ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంటారేమో చూడాల్సి ఉంది.