తెలుగు, తమిళ భాషల్లో సినిమాల్లో నటించి టాలీవుడ్ లో మిడిల్ రేంజ్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు శర్వానంద్ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు.చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇష్టం పెంచుకున్న శర్వానంద్ ఇంటర్ పూర్తైన తరువాత సినిమాల్లోకి వెళతానని ఇంట్లో చెప్పారు.
అయితే డిగ్రీ పూర్తి చేసిన తరువాత సినిమాల్లోకి వెళ్లమని తల్లి చెప్పగా శర్వానంద్ సికింద్రాబాద్ లోని ఒక కాలేజీలో బీకాం పూర్తి చేశారు.
చరణ్, రానా క్లాస్ మేట్ అయిన శర్వానంద్ చాలా సంవత్సరాల పాటు వాళ్లతో కలిసి చదువుకున్నారు.
నటుడు ఆర్యన్ రాజేష్ సూచనల మేరకు ముంబైలోని ఒక యాక్టింగ్ స్కూల్ లో నాలుగు నెలలు నటుడిగా శిక్షణ తీసుకున్న శర్వానంద్ ఎంత ప్రయత్నించినా సినిమా అవకాశాలు దక్కలేదు.ఆ తరువాత కొందరు సన్నిహితుల సూచనల మేరకు విశాఖలోని సత్యానంద్ యాక్టింగ్ స్కూల్ లో చేరిన శర్వానంద్ కు అక్కడ చేరిన తరువాత ఐదో తారీఖు అనే సినిమాలో ఛాన్స్ దక్కింది.

అయితే ఐదో తారీఖు సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.ఆ సినిమా తరువాత గౌరి మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో యువసేన సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడిగా శర్వానంద్ నటించారు.శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో శర్వానంద్ చిన్నపాత్రలో నటించగా ఆ పాత్ర శర్వానంద్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే నటుడిగా గమ్యం, ప్రస్థానం సినిమాలు శర్వాకు పేరుతో పాటు గుర్తింపును తెచ్చేపెట్టాయి.
రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు నటుడిగా శర్వానంద్ కు విజయాలను అందించాయి.
శతమానం భవతి మూవీ శర్వానంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
గత కొంతకాలం నుంచి సరైన సక్సెస్ లేని శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం మూవీలో నటిస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
ఈ నెల 11వ తేదీన శ్రీకారం సినిమా విడుదల కానుంది.