అలాంటి వెబ్ సైట్ లో పునర్నవి ఫొటోలు.. ఆమె ఏం అనిందంటే?

పునర్నవి ఈ పేరు గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పునర్నవి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

 Punarnavi, Sensational Comments, Big Boss, Dating,punarnavi,dating Webseries,big-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది.రాజ్ తరుణ్ హీరోగా ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పునర్నవి తరువాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పిట్ట కథ, మనసుకు నచ్చింది వంటి చిత్రాలలో నటించిన పెద్దగా పాపులారిటీని సంపాదించుకున్న లేకపోయింది.

Telugu Big Boss, Punarnavi, Sensational-Movie

ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ త్రీ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.బిగ్ బాస్ హౌస్ లో ఈమె కనబర్చిన ఆటతీరు, ముక్కుసూటితనం, బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ రాహుల్ తో నడిపిన లవ్ ట్రాక్ ఈమెకు మరింత గుర్తింపు సంపాదించి పెట్టింది.అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చిన పునర్నవి బిగ్ బాస్ తర్వాత కూడా వీరిద్దరు ఎంతో చనువుగా వుండే వారు.దీంతో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి.

తరువాత వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం ఎవరి దారి వారు చూసుకున్నారు.

బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తూ మంచి ఆదరణ పొందిన పునర్నవి తాజాగా నటుడు రఘు నందన్ తో నిశ్చితార్థం అయ్యిందని సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకొని ఉన్న ఒక ఫోటో పోస్ట్ చేశారు.

అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ విషయం గురించి స్పందించిన పునర్నవి ఆహా టీమ్ వాళ్ళు ప్రమోషన్ లో భాగంగా అలా చేయమంటే నేను చేశామని చెప్పుకొచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పునర్నవి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదనే షాకింగ్ కామెంట్స్ చేశారు.అదేవిధంగాప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పునర్నవి ఫోటోలు డేటింగ్ యాప్ లో కనిపించడం పై కూడా ఆమె స్పందించారు.

డేటింగ్ యాప్ లో ఎవరో తార హాసిని అనే పేర్లతో తన ప్రొఫైల్ ఫోటో క్రియేట్ చేశారు.ఆ విధంగా డేటింగ్ యాప్ లో నా ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను.

నేనెప్పుడు ఆ యాప్ ను వాడలేదు, ఎవరితోనో డేటింగ్ చేయలేదు,అలాగే ఆ ఫోటోల గురించి ఎప్పుడో మర్చి పోయాను అంటూ ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube