తెలంగాణ టిపిసిసి చైర్మెన్ ఉత్తమ కుమార్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు అయిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మధు యాష్కీ, బట్టి విక్రమార్క , జగ్గారెడ్డి లు గాందీభవన్ లో సమావేశం అయ్యారు.పార్లమెంట్ సమావేశంలో ముఖ్యంగా మూడు విషయాలపై మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.
అందులో మొదటిది టిఆర్‌ఎస్ బిజేపి ల చీకటి బాగోతం గురించి.ఇన్ని ఏండ్లు అధికారంలో ఉన్న బిజేపి పై ఎందుకు అవినీతి విచారణ జరపడంలేదని ప్రశ్నించాలని చూస్తున్నారు.
రెండో విషయం వచ్చి విజయవాడ, హైదరాబాద్ ల మధ్య బుల్లెట్ ట్రైన్ గురించి లేవనెత్తనున్నారు.దేశంలో జరుగుతున్న అవినీతిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ టీమ్ మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.
కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటిఐఆర్ ను విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చెయ్యాలని పార్లమెంట్ సమావేశంలో మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.కరోనా వ్యాక్సిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైపల్యాలను కూడా లేవనేత్తే అవకాశం ఉంది.