వైఎస్ జగన్ పదవికి గండంగా మారుతున్న చంద్రబాబు మాటలు.. ?

రాజకీయం అంటేనే ఒక చదరంగం లాంటిదని ఊరికే అనలేదు మహానుభావులు.ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ, పావులు కదుపుతూ ఉంటేనే రాజకీయ మనుగడ కొనసాగుతుంది.

 Andrapradesh, Ys Jagan, Chandrababu, War Of Words-TeluguStop.com

ఇక ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్దితులే నెలకొన్నాయట.ఇన్నాళ్లూ ఏపీలో రాజకీయాలు రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య నడిచిందన్న విషయం తెలిసిందే.

కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ బురద రెండు మతాల మధ్య పులుముకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.

అదీగాక ఈ మధ్యకాలంలో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహలు ధ్వంసం చేయడం వంటి సంఘటనలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయట.

ఇకపోతే ఏపీలో బీజేపీ, వైఎస్సార్సీపీకి ప్రత్యామ్నాయంగా అవతరించాలని భావిస్తూ అందుకు తగ్గట్టుగానే బలం పెంచుకుంటున్నట్లుగా కనిపిస్తున్న క్రమంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ సైతం రాష్ట్రంలోని మెజార్టీ వర్గాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయట.

ఈ నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయట.

చంద్రబాబు గతంలో బీజేపీతో కలిసి బరిలో నిలిచిన సమయంలో ఎక్కడా మత ప్రస్తావన తీసుకు రాలేదు.కానీ ఇప్పుడు మాత్రం వైఎస్సార్సీపీ సర్కారును టార్గెట్ చేసే క్రమంలో సీఎం జగన్‌తోపాటు రాష్ట్ర హోం మంత్రి, డీజీపీతో పాటు జిల్లాల ఎస్పీలంతా క్రిస్టియన్లేనంటూ వ్యాఖ్యానించడం వివాదస్పదంగా మారిందట.

ఇప్పటికే బిజేపీ, ఏపీలో పాగా వేయడానికి తన వేగాన్ని పెంచుకుంటుండగా తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పర్యావసానంగా మాజీ ఎమ్మెల్యే, క్రిస్టియన్ సెల్ సభ్యులు ఆ పార్టీకి రాజీనామా కూడా చేశారట.మరి రానున్న రోజుల్లో ఈ మాటలు జగన్ సీటుకు ఎసరు పెడతాయా అనే సందేహాలు కూడా కొందరిలో తలెత్తుతున్నాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube