ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన అశ్విన్.. ఎలా అంటే..?!

ఆస్ట్రేలియా రెండో టెస్టులో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును నెలకొల్పారు.టెస్టుల్లో అత్యధిక మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌‌మెన్ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు.

 World Record Breaking Ashwin How Come, Ravindra Chandran Ashwin, New Record, Tea-TeluguStop.com

ఆసీస్‌తో జరిగిన మెల్‌బోర్న్ టెస్టులో ఏ రికార్డును తన కైవసం చేసుకున్నారు.ఈ రికార్డు నిన్నటి వరకు శ్రీలంక బౌలర్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది.

అయితే ఈ రికార్డు ఇక నుంచి మన భారతీయ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉంటుంది.స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ మ్యాచులలో ఎడమ చేతి వాటం కల బ్యాట్స్‌‌మెన్ ల 191 వికెట్లను తీయగలిగారు.

అయితే ఆసీస్ తో జరిగిన మెల్‌బోర్న్ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌‌మెన్ 192 వికెట్లను తీసి రికార్డు సృష్టించారు.ఓవరాల్ గా రవిచంద్రన్ అశ్విన్ పడగొట్టిన వికెట్ లలో సగానికి పైగా లెఫ్ట్ హ్యాండర్స్ వే ఉన్నాయి.

ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ లో ఆయన మొత్తం పడగొట్టిన వికెట్ల సంఖ్య 375.

ప్రస్తుతం టెస్టుల్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఆటగాళ్లను అవుట్ చేసిన జాబితాలో రెండవ స్థానంలో ముత్తయ్య మురళీధరన్ ఉండగా 186 వికెట్లతో మూడవ స్థానంలో జేమ్స్ అండర్సన్ ఉన్నారు.167 వికెట్లతో అనిల్ కుంబ్లే 6వ స్థానంలో ఉన్నారు.అయితే టెస్టుల్లో ఓవరాల్ గా ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లను, షేన్ వార్న్ ఏడు వందల వికెట్లను పడగొట్టారు కానీ వీరికంటే లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాట్స్‌‌మెన్ వికెట్లు ఎక్కువగా సాధించి చంద్రన్న అశ్విన్ మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Telugu Bowler, India-Latest News - Telugu

ఇకపోతే ఈ టెస్ట్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియా పై గెలిచింది.మొన్న అడిలైట్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన ఇండియా ఈసారి ఆస్ట్రేలియా పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. అజింక్యా రహానే సూపర్ కెప్టెన్సీ తోపాటు సెంచరీ చేసి అద్భుతమైన ఆటను కనబర్చడంతో ఈ గెలుపు సాధ్యం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube