ఒకప్పుడు అత్తా కోడళ్ళ మధ్య ఏదైనా గొడవ జరిగితే.కోడలు నెగ్గాల్సిందే.
కానీ ప్రస్తుతం అత్త నెగ్గుతుంది.కారణం సమాజంలో మార్పు.
మనుషుల్లో మార్పు.ఇలా ప్రతి విషయంలో మార్పుతో చాలా ముందుకు పోతుంది ఈతరం.
ఒకప్పుడు కేవలం గొడవలు మాత్రమే జరిగేవి.కానీ ఇప్పుడు పోట్లాటకే సిద్ధంగా ఉన్నారు.
వయసుతో, వరస తో సంబంధం లేకుండా కొందరు కోడళ్ళు అత్తల మీదకు చేయెత్తుతున్నారు.కాగా ఇలాగే ఓ చోట కోడలు అత్త ముక్కును కొరికిన సంఘటన కలకలం రేపుతుంది.
అలంపూర్ లో జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మంగలి వీధిలోని నివాసముంటున్న శారదమ్మ జయన్న దంపతులు.వీరికి ముగ్గురు కొడుకులు ప్రసాద్, భాస్కర్, శేఖర్ ఉన్నారు.వీళ్ళ ముగ్గురికి పెళ్లిళ్లు జరుగగా పెద్ద కొడుకు ప్రసాద్ మాత్రం అత్తగారింట్లో ఉంటాడు.మిగతా ఇద్దరు అన్నదమ్ములు తమ ఇంటిలోనే ఉండగా.
ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.

ఇలా తరచుగా జరిగే గొడవలో సోమవారం రోజున మళ్ళీ గొడవ జరిగింది.దీంతో చిన్న గొడవ కాస్త పెద్దది గా మారింది.గొడవ జరుగుతున్న క్రమంలో చిన్న కొడుకు శేఖర్ భార్య గొడవ జరగడానికి కారణం తన అత్తనేనని కోపంతో తన అత్త పైకి వెళ్ళింది.
దీంతో ఆమెను పట్టుకొని తన ముక్కును కొరికింది రేవతి.తన ముక్కు కు గాయం కాగా వెంటనే ముక్కునుండి రక్తం కింద పడింది.తీవ్రంగా రక్తం కారడంతో అక్కడున్న వాళ్ళు చూసి శారదమ్మను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.వైద్యుడు ఆమెకు చికిత్స చేయగా.
తన ముక్కుకు ఏడు కుట్లు పడ్డాయి.ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్న కోడళ్లకు నిజంగానే నేటి తరం అత్తలు భయపడాల్సిందే.