యమధర్మరాజు ఈ పేరు వింటేనే కొంతమందిలో భయం పుడుతుంది.యమపాశం చేతిలో పట్టుకుని నల్లటి దున్నపోతును వాహనంగా ఉపయోగించే యమధర్మరాజు ఎప్పుడు ఎవరిపై యమ పాశం విసిరి ఎవరి ప్రాణాలు బలి తీసుకుంటాడో ఎవరికి తెలియదు.
ఈ విధంగా యమధర్మరాజు పేరు చెప్తే ఎవరైనా భయపడాల్సిందే.భూలోకం పై మనం చేసిన పాప,పుణ్యాలు మనం చనిపోయిన తర్వాత యమలోకంలో వాటిని తేల్చి తగిన శిక్ష విధిస్తారని చెబుతుంటారు.
నరక లోకానికి అధిపతి అయిన యముడిని యమధర్మరాజు అని కూడా పిలుస్తారు.యముడు ఎవరి పట్ల పక్షపాతం చూపకుండా అందరికీ సమాన శిక్షలను అమలు చేస్తుంటారు.
ఎల్లప్పుడూ ధర్మం తో ఉండే ఈ యముడు స్వయానా ఈ ప్రపంచానికి కాంతిని ప్రసరింపచేసే సూర్య భగవానుడి పుత్రుడు.అలాగే యమధర్మరాజుకు చెల్లెలు యమి, సోదరుడు శనీశ్వరుడు ఉన్నారు.
యముడు యమపురిలో ఉండి, భూలోకం పై ఉన్న మనుషుల పాపపుణ్యాలను లెక్క కడుతుంటారు.
మన పురాణాల ప్రకారం భూలోకంలో నివసించేట టువంటి మానవులలో మొదటగా యమధర్మరాజు మరణం పొంది పరలోకానికి వెళ్ళినట్లు చెబుతారు.నిజానికి యమధర్మరాజు పేరు చెప్పగానే ఎంతోమంది భయపడతారు.అయితే యమధర్మరాజుకు కూడా మన దేశంలో కొన్ని చోట్ల దేవాలయాలను నిర్మించి, ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తారు అనే విషయం బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు.
కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఈ దేవాలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.
దక్షిణ దిశకు అధిపతి అయిన యమధర్మరాజు మనం చనిపోయిన తర్వాత యమలోకంలో మన పాపాలను లెక్కలు చెప్పడానికి యమధర్మరాజు పక్కన చిత్రగుప్తుడు ఉంటాడనే సంగతి మనకు తెలిసిందే.
యముడు అందరి పట్ల నిష్పక్షపాతంగా ఉండి పాపులకు సమాన శిక్షలను అమలు చేయటం వల్ల యమధర్మరాజు అని పిలుస్తారు.