తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్‌బాస్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.ప్రస్తుతం బిగ్‌బాస్ నాలుగో సీజన్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుండటంతో ఈ షోకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వస్తోంది.
ఇక ఈ షో ఫినాలేకు చేరుకోవడంతో బిగ్‌బాస్ 4 విన్నర్ ఎవరా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.కాగా ఈ బిగ్‌బాస్ సీజన్ 4లోని కంటెస్టెంట్స్‌లో లవ్‌బర్డ్స్ గుర్తింపును తెచ్చుకున్న అఖిల్, మోనాల్ గజ్జర్‌లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు.
వారి మధ్య నడిచిన లవ్ ట్రాక్ బిగ్‌బాస్‌కు బాగా కలిసొచ్చింది.వారి ప్రేమకథను చూసేందుకు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోవడంతో బిగ్‌బాస్ వ్యూవర్‌షిప్ బాగా పెరిగింది.అయితే ఇటీవల మోనల్ గజ్జర్ బిగ్‌బాస్ నుండి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.ఆమె లేని లోటు బిగ్‌బాస్ హౌజ్‌లో పూర్తిగా కనిపించింది.
కాగా బిగ్‌బాస్ నుండి బయటకొచ్చిన మోనల్‌కు అదిరిపోయే ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.తాజాగా ఆమెకు స్టార్ మా ఛానల్‌లో ఓ డ్యాన్స్ షో చేసేందుకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ షోతో మరింత క్రేజ్‌తో పాటు అవకాశాలు ఆమెకు రావడం ఖాయమని ఆమె అభిమానులు అంటున్నారు.
ఇక బిగ్‌బాస్ రియాలిటీ షోలో మోనల్‌కు అదిరిపోయే రెమ్యునరేషన్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఆమెకు బిగ్‌బాస్ విన్నర్‌తో సరిసమానంగా పేమెంట్ ఇచ్చినట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.ఏదేమైనా సినిమాల్లో రాని గుర్తింపు, అవకాశాలు కేవలం బిగ్‌బాస్ షోతో మోనల్‌కు వస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఇక బిగ్‌బాస్ 4 విన్నర్ ఎవరా అనే అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది.అఖిల్, అభిజిత్, సోహెల్, ఆరియానా, హారికాలు బిగ్‌బాస్ సీజన్ 4 ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్‌గా ఉండటంతో, ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరా అనే అంశానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది.