సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియమ్ సినిమాని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.మల్టీ స్టారర్ కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
ఇక రానా సెకండ్ లీడ్ హీరోగా నటిస్తున్నాడు.ఇద్దరు హీరోల మధ్య ఇగోల మధ్య నడిచే ఆధిపత్యమే ఈ సినిమా కథాంశం.
ఇలాంటి ఎలిమెంట్స్ కి తెలుగులో మంచి డిమాండ్ ఉండటంతో దీనిని రీమేక్ చేస్తున్నారు.ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే తుది దశకి చేరుకుంది.
దీంతో దర్శకుడు షూటింగ్ షెడ్యూల్ ని కూడా ఖరారు చేశాడు.రానా విరాటపర్వం షూటింగ్ ని ఈ నెలాఖరుకి కంప్లీట్ చేస్తున్నాడు.
అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ నెలలో వకీల్ సాబ్ షెడ్యూల్ పూర్తి చేస్తాడు.ఈ నేపధ్యంలో జనవరి మొదటి వారం నుంచి అయ్యప్పన్ రీమేక్ కోసం ఇద్దరూ రెడీగా ఉన్నారు.

వారి నుంచి సిగ్నల్ రావడంతో జనవరి 2 నుంచి అయ్యప్పన్ రీమేక్ షూటింగ్ షెడ్యూల్ ని దర్శకుడు సాగర్ చంద్ర ఖరారు చేశాడు.ఇక సోమవారం ఈ సినిమా షూటింగ్ కోసం అఫీషియల్ లాంచింగ్ ఉండబోతుందని తెలుస్తుంది.దాదాపు నెలరోజుల కాల్షీట్ మాత్రమే పవన్ కేటాయించాడు.ఈ సినిమాను త్రివిక్రమ్ ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించడంతో పవన్ కూడా సినిమాను ముందుగా పూర్తి చేయడానికి ఓకే చెప్పాడని తెలుస్తుంది.
పవన్ ఇమేజ్ తగ్గట్లు కథలో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తుంది.ఇందులో పవన్ సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
మరి ఈ వార్తలలో క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే.