కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్.కెరియర్ లో చేస్తున్న మూడో సినిమానే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించి ఒక్కసారిగా స్టార్ దర్శకుడుగా మారిపోయాడు.
దేశ వ్యాప్తంగా ఆ సినిమాతో దర్శకుడుగా తన బ్రాండ్ ని ప్రశాంత్ నీల్ పరిచయం చేసుకున్నాడు.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రస్తుతం జరుగుతుంది.మొదటి సినిమా కంటే మరింత గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ లాంటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమాపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
ఇప్పటికే టాలీవుడ్ రెండు పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు ప్రశాంత్ నీల్ కి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాయి.అందులో మైత్రీ మూవీ ఒకటి కాగా, యూవీ క్రియేషన్స్ మరొకటి.
దీంతో పాటు కన్నడలో కూడా ప్రశాంత్ నీల్ కి కొన్ని కమిట్మెంట్ లు ఉన్నాయి.
తెలుగులో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ఉంటుందని టాక్ నడుస్తుంది.
అలాగే డార్లింగ్ ప్రభాస్ కి కూడా ఒక కథ చెప్పి ఫైనల్ చేసుకున్నాడని తెలుస్తుంది.మరో వైపు కేజీఎఫ్ కి ముందే కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్రశాంత్ నీల్ కమిట్ అయినట్లు సమాచారం.
మరి కేజీఎఫ్ హిట్ తర్వాత పాన్ ఇండియా దర్శకుడుగా మారిపోయిన ప్రశాంత్ నీల్ మాతృభాష హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ మీద ఫోకస్ పెడతాడా లేదా పాన్ ఇండియా స్టార్స్ ఆయిన ప్రభాస్, ఎన్టీఆర్ లతో సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
.