జబర్దస్త్ కామెడీ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో అవినాష్ ఒకరు.జబర్దస్త్ తో పాటు సినిమాల్లో నటిస్తూ, ఈవెంట్లలో పాల్గొంటూ అవినాష్ ఆర్థికంగా కూడా స్థిరపడ్డారు.
అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల కొన్ని నెలల పాటు జబర్దస్త్ షో షూటింగ్ ఆగిపోవడం వల్ల అవినాష్ ను ఆర్థికపరమైన కష్టాలు చుట్టుముట్టాయి.లాక్ డౌన్ సమయంలో ఈఎంఐ కట్టలేక అవినాష్ ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారు.వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ షోలో పాల్గొని షోలో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా ప్రూవ్ చేసుకుంటున్న అవినాష్ ఒక సందర్భంలో ఈ విషయాలను చెప్పుకొచ్చారు.అయితే ఎన్ని కష్టాలు ఉన్నా బిగ్ బాస్ షోలో మాత్రం జోకులు వేస్తూ, ఇమిటేట్ చేస్తూ అవినాష్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినప్పటికీ ఇతర కంటెస్టెంట్లకు అవినాష్ గట్టి పోటీ ఇస్తున్నారు.ఎలిమినేషన్ కు నామినేట్ అయితే కొంచెం డల్ అవుతున్నా ఎలిమినేషన్ నుంచి ప్రతిసారి సేవ్ అవుతూ వస్తున్నారు.అరియానాతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నా అవినాష్ ఫన్ కోసమే ట్రాక్ నడుపుతున్నాడని అతని అభిమానులు చెబుతున్నారు.అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్లు అవినాష్ పరువు తీసేశారు.
అరియానా, సోహెల్ అవినాష్ ను ఆట పట్టించారు.అరియానా అవినాష్ తో నువ్వు షర్ట్స్ వేసుకోవద్దని షర్ట్స్ వేసుకుంటే అంకుల్ లా కనిపిస్తున్నావని చెబుతుంది.అవినాష్ తాను అంకుల్ కాదని అరియానానే ఆంటీ అని చెబుతాడు.వెంటనే సోహెల్ అవినాష్ కు పొట్ట ఉన్నా ఇల్లీగల్ ఎఫైర్లు ఉన్నాయని.కూకట్ పల్లి, మణికొండలో అకౌంట్లు కూడా ఉన్నాయని అన్నాడు.దీంతో అవినాష్ తాను ఏం పాపం చేశానంటూ దిగులుగా ఫేస్ పెడతాడు.