ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.సినిమాల్లో అవకాశాలు పెరగాలంటే మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.తాజాగా మరో ప్రముఖ హీరోయిన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని వార్తల్లో నిలిచింది.7/జీ బృందావన కాలనీ సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సోనియా అగర్వాల్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.
అయితే తొలి సినిమా హిట్టైనా సోనియా ఆ తరువాత హీరోయిన్ గా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో సోనియా అగర్వాల్ కు అవకాశాలు తగ్గాయి.తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన డైరెక్టర్ సెల్వ రాఘవన్ నే పెళ్లి చేసుకున్న సోనియా అగర్వాల్ కొన్ని కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది.
గత కొన్నేళ్ల నుంచి సోనియా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమెకు సరైన పాత్రలు దక్కడం లేదు.దీంతో సినిమా రంగంలో అవకాశాలు సంపాదించాలని సోనియా అగర్వాల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.అయితే సోనియా ప్లాస్టిక్ సర్జరీ గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.38 ఏళ్ల వయస్సులో ప్లాస్టిక్ సర్జరీ అవసరమా సోనియా.? అంటూ సోనియాను ట్రోల్ చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అయితే సోనియా అగర్వాల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా ఆమె ఫేస్ అట్రాక్టివ్ గా అయితే కనిపించడం లేదు.అయితే సోనియా అగర్వాల్ లుక్ ను పూర్తిగా మార్చుకోవడంతో దర్శకనిర్మాతలు ఆమెను పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
కొన్ని రోజుల క్రితం ఒక దర్శకుడు తల్లి పాత్ర ఆఫర్ చేయడంతో సోనియా ఆ దర్శకునిపై సీరియస్ అయ్యారని ఆ తరువాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.