కీర్తి సురేష్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మహానటి సినిమా.ఈ సినిమాలో అందం, అభినయం, అమాయకత్వంతో నటించి జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డ్ పొందింది.
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అవార్డ్ లు , రివార్డ్ లతో పాటు తెలుగు ఖ్యాతి గర్వించేలా కీర్తి సురేష్ కు స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది.ఈ సినిమా తరువాత తమిళంతో పాటు తెలుగులో వరుస ఆఫర్లతో తోటీ హీరోయిన్లతో పోటీ పడుతుంది.
తాజాగా కీర్తి నటించిన మిస్ ఇండియా సినిమా విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.ప్రస్తుతం కీర్తి.
,మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట లో యాక్ట్ చేస్తుండగా.,మరికొన్ని సినిమాలు వరుసగా సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.
అయితే ఇప్పడు మనం ఈ మహానటి గురించి మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక దంపతుల కుమార్తె కీర్తి సురేష్.
కీర్తి స్కూలింగ్ అంతా చెన్నై, తిమిళనాడు లో కొనసాగగా 2000సంవత్సరంలో బాలనటీగా ఎంట్రీ ఇచ్చింది.కాలేజ్ డేస్ లో చెన్నై పెర్ల్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంది.
అక్కడి నుంచి స్కాట్లాండ్ లో నాలుగు నెలల పాటు ఒక కోర్సు చదివిన కీర్తి.లండన్ లో రెండు నెలల ఇంటర్న్ షిప్ లో చేరింది.
ఇండియాకి వచ్చిన అనంతరం మలయాళంలో గీతాంజలి సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా తన కెరియర్ ను ప్రారంభించింది.అనతి కాలంలో తమిళ్, మలయాళంతో పాటు 2015లో నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
ఆ తరువాత నేనులోకల్, అజ్ఞాత వాసి, మహానటి, తాజాగా విడుదలైన మిస్ ఇండియా సినిమాల్లో నటించి మెప్పించింది.ప్రస్తుతం మహేష్ సరసన సర్కారువారి పాట సినిమాలో యాక్ట్ చేస్తున్న కీర్తి… తనకు ప్రేమపెళ్లి ఆలోచనలు లేవని చెప్పింది.
స్ట్రెస్ లో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం, తప్పులు చేసినప్పుడు లేక్కలేసుకోకుండా, వాటినుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఫిలాసఫీతో ముందుకు సాగుతున్నట్లు చెప్పింది.ఇక మీరు సింగిలా కమిటెడా అని ప్రశ్నించగా తాను కమిటెడ్ టు వర్క్ అని నవ్వుతూ చెబుతోంది కీర్తి.