తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ కానిస్టేబుల్ అందరూ మెచ్చుకునలా డ్యూటీ చేశారు.హైదరాబాద్ నగరంలో రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల వారికి చెప్పాల్సిన అవసరమే లేదు.
అరగంటలో ఇంటికి వెళ్లాల్సిన వారు గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండిపోయి అనేక అవస్థలు పడటం భాగ్యనగరంలో చూస్తూ ఉండడం సర్వసాధారణం.అలా కొందరు ట్రాఫిక్ లో పేషెంట్లు ఇరుక్కుపోయి కొంతమంది చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎందరో ఉన్నారు.
ఇలాంటి సందర్భాలను మనం చాలానే చూశాం కూడా.అయితే తాజాగా హైదరాబాద్ మహా నగరంలోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ట్రాఫిక్ లో ఆగిపోయిన అంబులెన్స్ కు సరైన సమయంలో దారిని ఇప్పించి సకాలంలో ఆస్పత్రికి చేరేలా చూడగలిగాడు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
హైదరాబాద్ మహానగరంలోని అబిడ్స్ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జి విధులు నిర్వహిస్తున్నాడు.
ప్రతిరోజు రద్దీగా ఉండే మొజంజాహి మార్కెట్ వద్ద ఆయన వీధులను నిర్వహిస్తున్నాడు.అదే సమయంలో కోటి కి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ లో చిక్కుకొని ఉన్న అంబులెన్సు ను అతను గమనించాడు.
దాంతో ఆ అంబులెన్సు ను హాస్పిటల్ కు ఎలాగైనా పంపించాలని అక్కడ ఉన్న ట్రాఫిక్ ను వీలైనంత క్లియర్ చేయాలని అతడు ఆలోచించాడు.దీంతో అనుకున్నదే ఆలస్యంగా అతడు ఆ అంబులెన్సు కు ముందు పరిగెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వెళ్లాడు.
వెనుక అంబులెన్స్ ఉందన్న విషయాన్ని వాహనదారులకు తెలుపుతూ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ అంబులెన్స్ వెళ్ళడానికి సహకరించాడు.దీంతో ఆ అంబులెన్స్ సరైన సమయంలో ఆస్పత్రికి చేరుకోవడంతో అందులోని వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.దీంతో బాబ్జికి తన ఉన్నత అధికారుల నుంచి అలాగే సోషల్ మీడియా నుండి పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది.