టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తొలిసారిగా రాజకీయారంగ్రేటం చేశారు.ఆ ఎన్నికల్లో లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయారు.
అయితే ఆ తర్వాత లోకేష్ మంగళగిరిలో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు.మంగళగిరిలో రాజధాని ఏర్పాటు చేయడంతో పాటు ఎంతో అభివృద్ధి చేసినా లోకేష్‌ను అక్కడ ప్రజలు ఓడించారు.
అయితే ఇప్పుడు మంగళగిరి అంత సేఫ్ కాదని భావించి లోకేష్ నియోజకవర్గం మారే ఆలోచనలో ఉన్నారంటున్నారు.
ఇప్పటికిప్పుడే ఎన్నికలు లేకపోయినా గత ఎన్నికల్లోలా చివర్లో మంగళగిరిలో నామినేషన్ వేయడంతో లోకేష్ ఎంత మంత్రి అయినా, అప్పటి సీఎం చంద్రబాబు కొడుకు అయిన మంగళగిరి ప్రజలకు చేరువ కాలేదు.
లోకేష్ ఓటమికి ఉన్న అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి.అందుకే ఇప్పటి నుంచే ఓ నియోజకవర్గం ఎంచుకుని అక్కడ ఇప్పటి నుంచే వర్క్ చేసుకుంటే మంచిదన్న ఆలోచనలోనే లోకేష్ ఉన్నాడట.
చంద్రబాబుతో పాటు టీడీపీ సీనియర్లు కూడా ఇదే ఆలోచనలో ఉండడంతో లోకేష్ కోసం రెండు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.ఒకటి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు.కమ్మ సామాజిక వర్గానికి పెట్టని కోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా నంబూరు శంకర్రావు ఉన్నారు.ఇక రెండో ఆప్షన్‌గా గుంటూరు నగరంలోని గుంటూరు పశ్చిమం లేదా రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం పేరు పరిశీలనకు రానుందంటున్నారు.
ఎక్కువ మంది నేతలు మాత్రం పెదకూరపాడు పేరునే సూచిస్తున్నారట.మరి లోకేష్ ఫైనల్‌గా ఏ నియోజకవర్గం ఎంచుకుంటారో ? చూడాలి.