అక్కినేని కోడలు సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పదేళ్ల క్రితం సినీ రంగంలో అడుగుపెట్టిన ఆమె ఓటమి అనేది లేకుండా ఎంతో సక్సెస్ ఫుల్ గా స్టార్ హీరోయిన్ అయ్యింది.
ఇటు సినీ కెరీర్ ని అటు ఇంటిని రెండిటిని ఎంతో జాగ్రత్తగా మ్యానేజ్ చేస్తూ అద్భుత ఇల్లాలుగా కొనసాగుతుంది సమంత.
అలాంటి సమంత లాక్ డౌన్ కు ముందు ఒకలా ఇపుడు ఒకలా కనిపిస్తుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న సరే.అక్కినేని వారి కోడలు అయినా సరే సమంత ఎప్పుడు కూడా ఆ సినిమా ఈ సినిమా అంటూ తిరిగేది.కానీ లాక్ డౌన్ తర్వాత.ఇల్లాలు అంటే సమంత అనేలా ప్రవర్తిస్తుంది.ప్రవర్తన కాదు కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ లో సమంత చాలా నేర్చుకుంది.ఇంటి పట్టునే ఉంటూ.
ఇంట్లో పెంపుడు జంతువులను.మొక్కలను పెంచుతూ.
అభిమానులకు కరోనా వైరస్ జాగ్రత్తలు చెప్తూ.పెరటి పెంపకం గురించి నేర్పుతూ ఎంతో సక్సెస్ ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది సమంత.
అలాంటి సమంత ప్రస్తుతం మెగా కోడలు ఉపాసన కొణిదెలతో కలిసి.ప్రజల ఆరోగ్యం కోసం కొన్ని వంటలు చేసి అవి ఎలా ఉపయోగపడుతాయి.
హెల్తీ లైఫ్ అంటే ఏంటి అనే విషయంపై అవగాహనా కల్పిస్తున్నారు.
ఇక అలానే సమంత ఇప్పుడు ఒక పోస్ట్ చేసింది.
ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు అంతా ఆశ్చర్యపోతున్నారు.అంతలా ఆ పోస్ట్ లో ఏముంది అంటే? గార్డెనింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం అని.కానీ ఇన్నాళ్లు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అది కుదరలేదని. లాక్ డౌన్ సమయంలో మొక్కల పెంపకంపై ఎక్కువ సమయం పెట్టినట్టు.
చిన్న పనులు ఆశావాహదృక్పథాన్ని పెంపొందించినట్టు.ఏదైనా పని అంకిత భావంతో చేసి అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటా అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సమంత మాటలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయ్.