ఆకాశంలో ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజు సాధారణంగా ఎన్నో మార్పులు సంతరించుకుంటూ ఉంటాయి.అమావాస్య రోజున ఆకాశం నల్లని మబ్బులతో కమ్ముకొని ఏర్పడుతుంది.
అదే పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి అతి దగ్గరగా వచ్చి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ప్రలజను కనువిందు చేస్తాడు.ఇలా చంద్రుడు చాలా సంవత్సరాలకు ఒక్కసారి భూమికి దగ్గరగా వచ్చి కనువిందు చేయడాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు.
ఇప్పుడు 2020 సంవత్సరం అక్టోబర్ నెలలో రాత్రి సమయంలో ఉల్క పాతాలు ఏర్పడి ఆకాశంలో కనువిందు చేయనున్నాయి.అంతేకాకుండా ఈ నెల 31వ తేదీన ఆకాశంలో మరో అద్భుతం జరగబోతుంది.
ఈ అద్భుతాన్ని కనులారా చూసేందుకు, యావత్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది.ఆరోజు ఆకాశంలో నిండుచంద్రుడు ఎంతో కాంతివంతంగా ప్రకాశిస్తూ నీలిరంగులో కనువిందు చేయబోతోంది.దీనినే బ్లూమూన్ అని కూడా అంటారు.అయితే కొందరు బ్లూమూన్ అంటే ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి సంతరించుకున్నప్పుడు రెండవ సారి వచ్చిన పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు అని కొందరి అభిప్రాయం.
సాధారణంగా‘ బ్లూమూన్’ ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఆకాశంలో కనువిందు చేస్తుంది.మరి కొందరు భావిస్తున్నారు.
ఇలాంటి అద్భుతమైన ఘటన రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చోటుచేసుకుందని, మరి ఇప్పుడు 2020 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన ఇలాంటి అద్భుతం ఆకాశంలో చోటుచేసుకుంటుంది.అయితే ఇలాంటి అద్భుతమైన సంఘటన మరో 19 సంవత్సరాల తర్వాత కనువిందు చేయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
అయితే 76 సంవత్సరాల తర్వాత ఆకాశంలో ఇలాంటి అద్భుతమైన సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు అందరూ ఆ జాబిలమ్మ అందాన్ని వీక్షించేందుకు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.అక్టోబర్ 31, 2020 న ఏర్పడే చంద్రుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీలి చంద్రుడు కానప్పటికీ, ఇది ఇప్పటికీ అపారమైన అంతరిక్ష ప్రభావంతో కూడుకున్న రాత్రి.
అంతే కాకుండా ఆకాశంలో చూడడానికి నిజమైన దృశ్యంతో నిండు చంద్రుడు ప్రజలను కనువిందు చేస్తాడని,ప్రజలందరూ ఆరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.