ట్రాఫిక్ పోలీసుల తో చలానాలను తప్పించుకోవడానికి హైదరాబాదులో వాహనదారులు ఇలాంటి ప్రయోగాలకు పాల్పడుతున్నారు.రిజిస్ట్రేషన్ నెంబర్ ట్యాంపరింగ్, నెంబర్ ప్లేట్లను వంచి వేయడం, నెంబర్ ప్లేట్ లపై మాస్కులు వేలాడదీయడం ఇలాంటి రెక్కలతో ట్రాఫిక్ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
అంతేకాకుండా ఇప్పుడు ఒక డ్రైవర్ ఏకంగా వేరే వాహనం యొక్క నెంబర్ ను తన కారు నెంబర్ ప్లేట్ పై రాసుకుని యదేచ్ఛగా తిరిగేస్తున్నాడు.ట్రాఫిక్ పోలీసులు చాకచక్యంగా ఈ మోసాన్ని పసిగట్టారు.
బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిన్న మధ్యాహ్నం కెబిఆర్ పార్క్ వద్ద విధులు నిర్వహిస్తుండగా అలా వచ్చిన ఓ ఇన్నోవా కారును పరిశీలించారు.ఆ కారు పై నకిలీ నంబర్ ప్లేట్ అమర్చి ఉన్నట్లు గమనించారు.
ఆ నెంబరు ఓ ఆటో కు చెందినదిగా(TS 09 UC 7162) గుర్తించారు.ఆటో కు సంబంధించి అతివేగంగా వెళ్తున్నప్పుడు విధించిన మూడు చలానాలు పెండింగ్లో ఉన్నట్లు కనుగొన్నారు.
ఇన్నోవా కారు పై పసుపు రంగు నెంబర్ (టాక్సీ) ప్లేట్ వినియోగించాల్సి ఉంది.కానీ వైట్ బోర్డ్ ప్లేట్ ఉండడం కూడా పోలీసుల అనుమానానికి దారి తీసింది.
నెంబర్ ప్లేట్ మార్చడమే కాకుండా క్రిమినల్ చర్యకు పాల్పడినందుకు అతన్ని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించి, అతనిపై కేసు నమోదు చేయాలంటూ ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.
ఇలా నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డిసిపి హెచ్చరించారు.
ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా నెంబర్ ప్లేట్ లో మార్నింగ్, ట్యాంపరింగ్ లకు సంబంధించి 1,13,824 మంది వాహన యజమానులపై చర్యలు తీసుకున్నామని తెలియజేశారు.నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ కు పాల్పడిన 81 వాహనాలకు సంబంధించి 78 మంది పై క్రిమినల్ కేసులు వచ్చేసినట్లు ఆయన తెలిపారు.
వాహనదారులకు నెంబర్ ప్లేట్ లపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ 1910203626 నెంబర్కు సంప్రదించాలని తెలిపారు.