సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలంటే ముఖ్యంగా అందం, నటన వంటివి కావాలి.అందంలో కూడా శరీర రంగు,ఎత్తు,బరువు వంటివి కూడా ఎదుర్కొంటారు మన స్టార్ నటీనటులు.
అంతే కాకుండా సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ నటులు ఎన్నో స్థాయిల్లో సమస్యలు ఎదుర్కొని అడుగు పెడతారు.బయట వారికి సినిమాలలో రావడానికి అలాంటి సమస్యలు ఉన్నా.
స్టార్ నటీనటుల కూతుర్లు కుమారులు ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండానే సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.వాళ్ల తల్లిదండ్రులకు తగ్గట్టుగా మంచి స్థాయిలో ఉండటానికి వాళ్లు కూడా పెద్ద హోదానే పట్టేస్తున్నారు.
అంతే కాకుండా వాళ్లకు వాళ్ల తల్లిదండ్రుల లాగానే మంచి క్రేజ్, పాపులారిటీ కూడా దక్కుతుంది.ఇది కాక… వాళ్లకి ఎక్కువగా ఫాలోయింగ్ కూడా ప్రేక్షకుల నుండి ఉంటుంది.
అంతే కాదు వాళ్లు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే చాలు… మిలియన్ లకు పైగా లైకులు, ఫాలోవర్లు ఉంటాయి.
ఈ విధంగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్… ఈ మధ్య బాగా పాపులరిటీ సొంతం చేసుకుంది.
తండ్రికి తగ్గ కూతురుగా పేరు పొందాలని సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది.ఇటీవలే తాను సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో కు నల్లగా ఉందని, హైట్ కూడా తక్కువేనని కామెంట్లు చేశారు.ఆ మాటలకు సుహానా ఖాన్ ఎలా రియాక్ట్ అయ్యింది అనేది చెప్పాల్సిన అవసరం లేదు.రంగు గురించి మాట్లాడుతున్నారు? నల్లగా ఉంటే మీ సమస్య ఏంటి? మీరు అంత చదువుకున్న వారే కదా అంటూ కామెంట్ చేసిన వారికీ చుక్కలు చూపించి నెట్టింట వైరల్ చేసింది.ఇప్పుడు బ్లాక్ కలర్ టాప్ వేసుకుని దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి రంగు గురించి, హైట్ గురించి మాట్లాడిన వారికీ షాక్ ఇచ్చింది.ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.