హైదరాబాద్ గోదావరి ఖని కి చెందిన ఒక ఒక మహిళ హైకోర్టులో ఉన్న తన కేసు ఒకటి పెండింగ్ లో ఉండి, తీర్పు రావడంలో జాప్యం జరుగుతున్నందున ఆమె తీవ్ర నిరాశ చెంది ఆత్మ హత్యా యత్నానికి పాల్పడింది.ఈమె ఆత్మ హత్యా యత్నం హై కోర్టులో తీవ్ర కలకలం రేపింది.
ఆమె కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా ఆ విచారణ చాలా కాలం నుండి పెండింగ్లో ఉండడంతో, తన కేసు విచారణ ఎప్పుడు తేలుతుందో అని విసిగిపోయిన ఆమె కోర్టు మొదటి అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.
వెంటనే అక్కడున్న హైకోర్టు సెక్యూరిటీ సిబ్బంది గమనించి, ఆమెను అడ్డుకొని ప్రమాదం నుండి తప్పించారు.
తదుపరి ఆమెను సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చోబెట్టి విచారించగా ఆమె తన పేరు కవిత అని, ఆమె గోదావరిఖనికి చెందినదని, ఆమెను ఈ ఏడాది ఏప్రిల్ 11న మురళి అనే వ్యక్తి అత్యాచారం చేశాడని ఆమె వివరించింది.