టాలీవుడ్ స్టార్ హీరోల లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో లా జాబితాలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్ళినా కూడా సినిమా రంగంలో ఆయనకు తిరుగు లేదని పలు సార్లు నిరూపితమైంది.
ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఆ తర్వాత పవన్ చేయబోయే సినిమాలకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
పవన్ వరుసగా ఐదు సినిమాలకు కమిట్ అయ్యాడు.కానీ గత ఆరేడు నెలలుగా షూటింగ్ లో పాల్గొనడం లేదు.
కరోనా కారణంగా షూటింగ్ లో ఇన్నాళ్లు పాల్గొనని పవన్ కళ్యాణ్ ఇతరులు పాల్గొంటున్నా ఇంకా కూడా పొడవు జుట్టు కనిపిస్తున్నాడు జుట్టు పెంచి పెద్ద గడ్డంతో అదే లుక్ లో కనిపిస్తున్నాడు.
ఇన్ని రోజులు దీక్ష లో ఉన్న కారణంగా ఆయన గడ్డం జుట్టు పెంచి ఉంటాడు అని అంతా భావించారు.
కానీ నెలల తరబడి అలాగే జుట్టు మరియు గడ్డంతో ఉండటం వల్ల ఫ్యాన్స్ కు కూడా చిరాకుగా ఉందట.ఈ విషయం బాహాటంగా చెప్పలేక ఉన్నా కొందరు బయటపడకుండా మదనపడుతున్నారు.
ఎక్కువ శాతం అభిమానులు ఆయన ఎలా ఇష్టపడతారు అది వేరే విషయం.కానీ ఇలా ఎన్నాళ్లు అంటూ అభిమానులతో పాటు విమర్శకులు కూడా తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు.
పవన్ లుక్ విషయంలో అనేక ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి.ఇప్పటి వరకు అదే లుక్కుతో పవన్ ఉన్నాడు.
ఈ నెల చివర్లో సినిమా షూటింగ్ లో అయినా ఆయన షూటింగ్ లో జాయిన్ అవుతాడా లేదా అంటున్నారు.ఆయన షూటింగ్ కు హాజరు కాకపోవడంతో పాటు లుక్ మార్చక పోవడంను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.