ఆ డిమాండ్ల వల్లే శ్రీదేవిని బాహుబలిలోకి తీసుకోలేదంట... కానీ....

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన  “బాహుబలి” మరియు “బాహుబలి పార్ట్2” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద  ఎంతటి ఘాన విజయాన్ని సాధించాయో ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.

 Because Of Those Demands, Sridevi Was Not Taken To Bahubali Sridevi, Telugu For-TeluguStop.com

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇంతకీ ఆ వార్తలు ఏంటంటే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని మొదట్లో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రలో సీనియర్ నటి స్వర్గీయ శ్రీదేవి ని  తీసుకోవాలని అనుకున్నారట.

ఈ క్రమంలో ఆమెను సంప్రదించగా నటి శ్రీ దేవి ఈ చిత్రంలో నటించాలంటే పారితోషకంతో పాటూ  హిందీ డిజిటల్ రైట్స్ లో షేర్లు, షూటింగ్ కి హాజరైన సమయంలో ఒక ఫ్లోర్ మొత్తం హోటల్ గదులు, అలాగే ప్రతిసారి 05 బిజినెస్ క్లాస్  విమానంటికెట్లు, మరియు ఇతర డిమాండ్లను చిత్ర యూనిట్ సభ్యుల ముందు ఉంచిందని దీంతో బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ ఉండడంతో ఆమెని వద్దనుకున్నామని తెలిపాడు.

అయితే ఆ మధ్య శ్రీ దేవి (బ్రతికి ఉన్నప్పుడు) ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో ఈ విషయంపై స్పందించింది.

ఇందులో భాగంగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన గురించి చేసినటువంటి ఆరోపణలలో వాస్తవం లేదని  కొట్టి పారేసింది. అంతేగాక తన భర్త కూడా ఒక ప్రొడ్యూసర్ అని ఆ విషయం నాకు బాగా గుర్తుందని అలాంటప్పుడు ఇంత ఖరీదైన డిమాండ్లను ఎలా కోరతానని వాపోయింది.

 అంతేగాక దర్శకుడు రాజమౌళి చిత్రాలను అంతకుముందే తాను చూశానని అతనిపై తనకు మంచి గౌరవం ఉందని కానీ తనపై అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడో తనకు అర్థం కాలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు టాలీవుడ్ లో ఎంతో మంచి పేరున్నటువంటి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి వేరే వాళ్ళపై అనవసరంగా ఆరోపణలు ఎందుకు చేస్తారని కాబట్టి ఆ వార్తల్లో ఎంతో కొంత నిజం ఉంటేనే ఆయన మాట్లాడతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తదితరులు నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube