తెలుగులో ఒక సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన “హిట్లర్” చిత్రం అప్పట్లో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు రంభ నటించగా దాసరి నారాయణరావు, మోహిని, మీనా కుమారి, నటకిరీటి రాజేంద్రప్రసాద్, ఉత్తేజ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించినటువంటి నటి మీనా కుమారి గురించి ఇప్పుడు మరిన్ని వివరాలను తెలుసుకుందాం…
అయితే నటి మీనా కుమారి స్వతహాగా తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఎందుకో తెలుగులో సినిమా అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.దీంతో తమిళం, మళియాల పరిశ్రమలకి వెళ్లి అక్కడ బాగానే రానిస్తోంది.
ముందుగా మీనా కుమారి హీరోయిన్ అవ్వాలని సినిమా పరిశ్రమకు వచ్చినప్పటికీ పలు కారణాల వల్లహీరోయిన్ కాలేకపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ క్రమంలో హిట్లర్ తో పాటు టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “జయం మనదేరా” చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
అయితే నటి మీనా కుమారి ఒక వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
తెలుగులో అప్పట్లో ప్రసారమయ్యే అంతరంగాలు, అనురాగాలు, అనే సీరియల్స్ ద్వారా బుల్లితెర లో తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది. కాగా ప్రస్తుతం మలయాళం, తమిళం, తదితర భాషలలో ధారావాహికలలో నటిస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.