పూర్వం రాజుల కాలంలో ఒక దేశం మరో దేశంపై యుద్ధాలు చేసేవి.తరువాత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెంది పలు దేశాలు అణు బాంబులను తయారు చేశాయి.
అయితే చైనా మాత్రం దేశాలను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక వైరస్, బ్యాక్టీరియాలతో ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది.చైనా దేశం నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో వైరస్ ను కట్టడి చేయడానికి మందులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
కరోనాను సమర్థవంతంగా కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తప్ప వైరస్ ను కట్టడి చేయడం సాధ్యం కాదని వైద్యులు చెబుతున్నారు.అయితే తాజాగా చైనాలో మరో కొత్త రోగం వెలుగులోకి వచ్చింది.
గన్షు ప్రావిన్స్ రాజధాని లాంగ్‌ఝౌలో వేల సంఖ్యలో ప్రజలు బయోఫార్మాస్యూటికల్ కంపెనీలో లీకైన బ్యాక్టీరియా వల్ల వ్యాధి బారిన పడ్డారు. బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల 3,245 మంది వ్యాధి నిర్ధారణ అయింది.
గతంలో వ్యాప్తి చెందిన కరోనా వైరస్ కూడా ల్యాబ్ నుంచే వ్యాపించిందని వార్తలు రాగా తాజాగా నమోదవుతున్న బ్యాక్టీరియా కేసులు ఆ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
మాల్టా పేరుతో పిల్వబడే ఈ వ్యాధి చైనీయులను సైతం భయపెడుతోంది.
జ్వరం, తలనొప్పి, కండరాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, అలసట ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి.అయితే బ్యాక్టీరియా వేగంగానే వ్యాప్తి చెందుతున్నా ప్రాణ నష్టం కలగడం లేదని తెలుస్తోంది.
ఆహార పదార్థాల ద్వారా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని అందువల్ల ఈ బ్యాక్టీరియా ప్రమాదకరం అని అనుకోవడం లేదని చైనా చెబుతోంది.