వైరల్ వీడియో: దుబాయ్ దంపతుల కోసం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన వినూత్న వీడియో...!

ప్రస్తుతం భూమి మీద అతి పెద్ద మానవ నిర్మితం ఏది అంటే టక్కున ఎవరైనా సమాధానం చెప్పేది బుర్జ్ ఖలీఫా.దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా పై మనం ఇప్పటి వరకు కొన్ని సందర్భాలలో ఎల్ఈడి విద్యుత్ దీపాలతో కొన్ని లేజర్ షోలను నిర్వహించడం చూస్తూనే ఉన్నాము.

 Innovative Video On Burj Khalifa For Dubai Couple Laser Show, Burz Kalifa, Duba-TeluguStop.com

అయితే తాజాగా బుర్జ్ ఖలీఫా పై ఏర్పాటుచేసిన లేజర్ షో కాస్త వినూత్నంగా జరిగింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

తాజాగా దుబాయ్ దేశానికి చెందిన దంపతులకు సంబంధించి అక్కడే ఉన్న బుర్జ్ ఖలీఫా పై ఒక ప్రత్యేక లేజర్ షో ఏర్పాటు చేశారు.

ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.దుబాయ్ లోనే నివాసముంటున్న అనాస్, ఆస్లా లకు సంబంధించింది ఈ వీడియో.

ఇకపోతే ఈ వీడియోలో వారిద్దరి దంపతులకు పుట్టబోయే బిడ్డకు సంబంధించిన లింగ నిర్ధారణ వారి కుటుంబ సమక్షంలో బహిర్గతం చేశారు.ఇందుకోసం ఆ జంట కాస్త వెరైటీగా ఆలోచించే ప్రత్యేక ఏర్పాట్లను చేయించుకుంది.

వారు వారి కుటుంబ సభ్యులను, సన్నిహితులను, మిత్రులను బుర్జ్ ఖలీఫా ఉన్న ప్రాంతానికి వారు అందరినీ పిలిపించి వారికి ప్రత్యేకంగా పార్టీని ఏర్పాటు చేశారు.

ఇక వారందరూ అక్కడికి చేరుకున్న తర్వాత బుర్జ్ ఖలీఫా పై లేజర్ షో నిర్వహించారు.

ఇక ఆ సమయంలో 1 నుంచి 10 వరకు అంకెలు కౌంట్ డౌన్ తర్వాత వారికి పుట్టబోయే బిడ్డ మగ.? ఆడ…? అన్న విషయాన్ని బహిర్గతం చేశారు.ఇందుకు సంబంధించి భార్య భర్తలు వారికి పుట్టబోయేది అబ్బాయి అని వెల్లడించారు.దీంతో వారు పార్టీకి వచ్చిన వారందరూ తెగ కేరింతలు పెట్టారు.ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసినా నెటిజెన్స్ ఆ ఇద్దరి దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు.అయితే బుర్జ్ ఖలీఫా ఈ లేజర్ షో కోసం ఏకంగా రూ.75 లక్షలు ఖర్చు చేయడం నిజంగా గమనించాల్సిన విషయం.