విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న మరో విభిన్న కథా చిత్రం నారప్ప.ఈ మధ్య కాలంలో రొటీన్ కథలని పక్కన పెట్టిన వెంకటేష్ కొత్తదనం ఉన్న కథలతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు.
అందులో భాగంగానే గురు సినిమా కూడా చేసి హిట్ కొట్టాడు.ఒకప్పటిలా హీరోయిన్స్ తో డ్యూయెట్ లు పాడుకునే సినిమాలకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
కొత్తదనం ఉన్న కథ వేరే భాషలో ఉన్న వాటిని తీసుకొచ్చి రీమేక్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే వెంకటేష్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ సినిమా అసురన్ ని తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్నసంగతి అందరికి తెలిసిందే.
ఇక ఈ సినిమా ద్వారా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా కాలం తర్వాత తిరిగి తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ అతని కెరియర్ గాడిలో పడుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీ చేసుకున్న నారప్ప కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
అయితే మళ్ళీ షూటింగ్ లకి అనుమతులు ఇవ్వడంతో చాలా మంది హీరోలు, దర్శకులు తమ సినిమా షూటింగ్ లు స్టార్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే కొంత మంది సెట్స్ పైకి వెళ్లిపోయారు.ఈ నేపధ్యం నారప్ప షూటింగ్ షెడ్యూల్ కూడా శ్రీకాంత్ అడ్డాల ప్లాన్ చేస్తున్నాడు.అక్టోబర్‌లో మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్‌లో ‘నారప్ప’ చిత్రబృందం ఉందని టాక్.అక్టోబర్‌లో ప్రారంభించి సినిమా మొత్తాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలన్నది ఆలోచనట.
ఈ చిత్రంలో వెంకటేశ్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుంది.ఇక ఇందులో వెంకటేష్ కి జోడీగా ప్రియమణి నటిస్తుంది.