భారతీయులు ఎంతో ఇష్టంగా తినే మాంసాహారాల్లో `రొయ్యలు` ముందు వరసలో ఉంటాయి.రొయ్యలతో రకరకాల వంటలు తయారు చేస్తారు.
ఎలా చేసినా.రొయ్యల రుచి అద్భుతంగా ఉంటుందని చెప్పాలి.
అయితే కొందరు మాత్రం రొయ్యలు తినడానికి అస్సలు ఇష్టపడరు.అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకుంటే.
ఖచ్చితంగా రొయ్యలను తినడానికి ప్రయత్నిస్తారు.
సముద్ర ఆహార ఉత్పత్తుల్లో రొయ్యలంత బలవర్ధకమైన మరొకటి ఉండదు అనడంలో సందేహమే లేదు.అవును! ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూర్చడంలో రొయ్యలు అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇందులో ఉండే సెలీనియం అనే పదార్థం క్యాన్సర్ వంటి భయంకర సమస్యల నుండి రక్షిస్తుంది.
క్యాన్సర్ సెల్స్‌ను పెరగకుండా చేసే శక్తి రొయ్యలకు పుష్కలంగా ఉంది.
అలాగే దంతాలు, ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం అన్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే రొయ్యల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.అందుకే వారానికి ఒకసారైన రొయ్యల్ని తీసుకోవాలి.
బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా తమ డైట్‌లో రొయ్యలను చేర్చుకోవాలి.ఎందుకంటే రొయ్యలు సులువుగా జీర్ణమవడంతో పాటు.
శరీరంలో అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి.
ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా రొయ్యలతో లభిస్తాయి.
అలాగే రొయ్యలు తినడం వల్ల మరో ప్రయోజనం ఏంటంటే.ఇందులో ఉండే జింక్, సెలీనియం శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది.
అందుకే రొయ్యలను తరచూ తీసుకుంటే మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.