అమెరికాలో నవంబర్ 3 వ తేదీన అధ్యక్ష్య ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపధ్యంలోనే అధ్యక్ష అభ్యర్ధులు అయిన బిడెన్, ట్రంప్ హోరా హోరీగా ప్రచారాలని నిర్వహిస్తూ గెలుపుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
బిడెన్ తనదైన వాక్చాతుర్యంతో అమెరికా ప్రజలని ఆకట్టుకుంటుంటే ట్రంప్ ఎప్పటిలానే పప్పులో కాలేస్తూ నవ్వులపాలవుతున్నాడు.తాజాగా తనని గెలిపించామని ప్రజలని ఉద్దేశించి చెప్పే క్రమంలో ప్రతీ ఒక్కరూ రెండు సార్లు ఓట్లు వేయండి అంటూ టంగ్ స్లిప్ అయ్యారు.
దాంతో అమెరికా ప్రజలు ఆలోచనలో పడ్డారు.అసలు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.
ఇంతకీ అసలు ఏమి జరిగిందంటే.కరోనా కారణంగా ట్రంప్ ఎన్నికలని వాయిదా వేయాలని ముందు భావించారు కానీ ఆ అవకాశం లేకపోవడంతో ప్రజలు అందరూ ఈ మెయిల్ విధానం ద్వారా ఓట్లు వేసేలా ప్లాన్ చేశారు కానీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే ఓటు వేయడానికి అందరూ ఏకాభిప్రాయానికి రావడంతో ఇక్కడ కూడా ట్రంప్ అనుకున్నట్టుగా జరగలేదు.
దాంతో ట్రంప్ ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ ఒక్క అమెరికన్ రెండు ఓట్లు వేయాలని ప్రకటించారు.

ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో బగ్గుమన్న బిడెన్ ఇలాంటి ప్రకటనలు చేయడం చట్టవిరుద్దమని ట్రంప్ పై మండిపడ్డారు.అంతేకాదు ఎన్నికల బోర్డ్ డైరెక్టర్ కూడా ట్రంప్ వ్యాఖ్యలని ఖండించారు.దాంతో ఈ పరిణామాలపై స్పందించిన వైట్ హౌస్ వర్గాలు ట్రంప్ ఉద్దేశ్యం అలా కాదని, రెండు ఓట్లు వేయమని చెప్పలేదని ముందుగా ఓటర్లు అధికారులు చెప్పిన విధానం ద్వారా ఓట్లు వేయాలని ఆ ఓటు నమోదు అయ్యిందా లేదా అనేది పోలింగ్ స్టేషన్ కి వెళ్లి చూసుకోవాలని ఒక వేళ నమోదు కాకపొతే వెంటనే ఓటు వేయాలని అన్నారని సర్ది చెప్పారు.
.