పబ్జీకి దీటుగా ఫౌజీ యాప్... అక్షయ్ కుమార్ ప్రచారం

ఇండియాలో యూత్ పై పబ్జీ మొబైల్ గేమింగ్ యాప్ ఎంత ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ గేమ్ కారణంగా చాలా మంది యువత మానసిక రోగులుగా మారిపోతే, కొంత మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.

 Akshay Kumar Announces New Game Fau-g, Made In India, Pub-g, Akshay Kumar, Mobil-TeluguStop.com

పబ్ జీ గేమ్ కి బానిసలుగా మారిపోయి చదువుని పూర్తిగా పక్కన పెట్టేశారు.ఇప్పుడు భారత్ ప్రభుత్వం ఆ గేమింగ్ యాప్ ని నిషేధించింది.

తాజాగా 188 యాప్ లని నిషేధించిన కేంద్రం ప్రభుత్వం అందులో పబ్ జీని కూడా చేర్చింది.ఎంతో మంది రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు పబ్ జీ గేమ్ ని నిషేధించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు పబ్ జీ కి ప్రత్యామ్నాయంగా ఫౌజీ గేమింగ్ యాప్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు.

Telugu Akshay Kumar, Akshaykumar, India, App, Pub-

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ యాప్ ని లాంచ్ చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన మేరకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా పబ్జీకి దీటైన మల్టీ ప్లేయర్ గేమ్ ను తీసుకువస్తున్నట్టు వెల్లడించారు.దీనికి ఫౌజీ అని నామకరణం చేశారు.

ఈ గేమ్ ను బెంగళూరుకు చెందిన ఎన్ కోర్ గేమ్స్ సంస్థ రూపొందించింది.అక్షయ్ కుమార్ దీనికి మెంటర్ గా ప్రచారకుడుగా ఉండనున్నారు.

ఫౌజీ గేమింగ్ యాప్ ద్వారా వినోదం మాత్రమే కాదని, భారత సైనికుల త్యాగాలను కూడా తెలియజేయబోతున్నామని అక్షయ్ కుమార్ వివరించారు. ఫౌజీ యాప్ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం భారత్ కా వీర్ ట్రస్టుకు అందజేస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube