ఆ విషయంలో భారత్ నిర్ణయాన్ని స్వాగతించిన అమెరికా...!

రోజురోజుకీ భారత్ అమెరికా దోస్తీ బలపడుతోంది.ఏదేశం ఎలా వున్నా.

 Us Supports India Chinese Apps Ban, China Apps, America, Clean Network Program,-TeluguStop.com

అమెరికా మాత్రం మన దేశ చర్యలను మొదటినుండి ఓహో అంటుంది.ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం తాజాగా నిషేధించిన మరో 118 చైనీస్ యాప్స్ ను ఉద్దేశించి అమెరికా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది.

అవును.భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా బల్ల గుద్ది మరీ సమర్థించింది.

యాప్స్‌ను బ్యాన్ చేసి ఇండియా మంచి పని చేసిందని అమెరికా అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ కెయిత్ క్రాక్ పేర్కొన్నారు.

ఇండియా గతంలో 59 యాప్స్ ను బ్యాన్ చేసిన సంగతి విదితమే.ఇందులో టిక్ టాక్ ఒకటి.దానితోనే టిక్ టాక్ పతనం స్టార్ట్ అయ్యింది.ఇపుడు ఆ కంపెనీ తమను ఎవరు కొంటారా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.భారత్ తీసుకున్న తాజా నిర్ణయాలపై ప్రపంచ దేశాలు తొంగి చూస్తున్నాయి.

ఇప్పుడు అమెరికా కూడా అదే బాటలో పయనించడం కొసమెరుపు.కాగా ఇండియా ఇప్పటికే 100కు పైగా చైనా యాప్స్ ను బ్యాన్ చేసేసింది.

Telugu Chinese Apps, America, Apps, China, China Apps, Chinese App, Clean Progra

ఈ నేపథ్యంలోనే అమెరికా అండర్ సెక్రెటరీ కెయిత్ క్రాక్ భారత్ ను ఉద్దేశించి, భారత్ ను ఆదర్శంగా తీసుకొని, పరాయి దేశాల యాప్స్ నుంచి స్వాతంత్య్రం కోరుకునే దేశాలన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అందరూ కలిసి ఏకతాటిపై నడిచి కలసి కట్టుగా పనిచేసి, క్లీన్ నెట్‌వర్క్‌ ను సృష్టించాలని అన్నారు.కాగా అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలోనే క్లీన్ నెట్‌వర్క్ ప్రోగ్రామ్ ‌ను ఆవిష్కరించింది.క్లీన్ నెట్‌ వర్క్ ప్రోగ్రామ్ అంటే అర్ధం.డేటా ప్రైవసీనే.ఇందులో భారత్ ముందడుగులో ఉండడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube