కరోనా కారణంగా ప్రపంచదేశాలు చైనాకు ఎదురుతిరిగాయి.చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా కారణంగా ప్రపంచదేశాలకు తీరని లోటు ఏర్పడింది.
వేల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది.ఆ దేశం చేసిన తప్పు వల్ల ప్రపంచదేశాలు కోలుకోలేని పరిస్థితి.
ఇప్పటికే అమెరికాతో సహా పలు దేశాలు చైనాను చూసి మండిపడుతున్నాయి.దీంతో చైనా ప్రభుత్వం వేరే దేశాల్లో నివాసముంటున్న చైనీయులకు తగిన సూచనలు అందించింది.
విదేశాల్లో ఉన్న చైనీయులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
అయితే అమెరికాలో ఉన్న చైనా యువత తమ దేశ వృద్ధులను కాపాడుకునేందుకు ఓ కొత్త పరికరాన్ని సృష్టించారు.
ఎవరైనా వృద్ధులపై దాడి చేయడానికి వచ్చినప్పుడు అలారం మీద నొక్కితే దాని నుంచి 125 డెసిబెల్ శబ్దం వెలువడుతుందని అన్నారు.ఈ శబ్దానికి దాడికి వచ్చిన వాళ్లు పారిపోవడం లేదా పడిపోవడం చేస్తారని చైనా యువత చెబుతున్నారు.
అప్పుడు ఆ దాడి నుంచి ముసలివాళ్లు తప్పించుకుని పారిపోవచ్చని అంటున్నారు.ఈ పరికరాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో తమ దగ్గరే ఉంచుకోవాలి.అయితే ఈ పరికరం వినియోగంపై వర్క్ షాపును ఏర్పాటు చేయడం జరుగుతుందని, తప్పకుండా హాజరుకావాలని చైనా యువత పేర్కొన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని, ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.